Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మాస్ రాజా బ్యూటీ మాస్ అందాలు

ఈ మాయ పేరేమిటో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య థాపర్

By:  Tupaki Desk   |   31 Dec 2023 6:57 AM GMT
పిక్ టాక్ : మాస్ రాజా బ్యూటీ మాస్ అందాలు
X

ఈ మాయ పేరేమిటో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య థాపర్. తెలుగు లో ఈ అమ్మడి మొదటి సినిమా నిరాశ పరచడంతో ఎక్కువ ఆఫర్లు రాలేదు. అయినా కూడా తన ప్రయత్నాలు మానకుండా సోషల్ మీడియా ద్వారా అందమైన తన ఫోటోలు షేర్‌ చేస్తూ వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది.


ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ కి జోడీగా ఈగల్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈగల్ సినిమా తర్వాత టాలీవుడ్‌ లో కావ్యా థాపర్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేసే కావ్యా థాపర్‌ మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు క్లీ వేజ్ షో తో కావ్యా థాపర్‌ మరోసారి తన అందంతో కుర్రకారు దృష్టిని ఆకర్షించింది.

కవ్వించే చూపులతో అందాల కావ్యా ముందు ముందు ఇలాంటి ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా స్టార్‌ హీరోల దృష్టిలో కూడా పడే అవకాశాలు లేకపోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈగల్‌ కనుక హిట్ అయితే తప్పకుండా కావ్యా థాపర్ కి టాలీవుడ్‌ లో స్టార్స్ కి జోడీగా నటించే అవకాశాలు దక్కవచ్చు.