Begin typing your search above and press return to search.

కావ్య థాప‌ర్ సొగ‌సు చూడ‌త‌ర‌మా?

కావ్య థాపర్ సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. లేటెస్ట్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తోంది

By:  Tupaki Desk   |   21 Dec 2023 11:48 AM GMT
కావ్య థాప‌ర్ సొగ‌సు చూడ‌త‌ర‌మా?
X

'ఏక్ మినీ క‌థ' చిత్రంతో కావ్యా థాప‌ర్ పేరు టాలీవుడ్ లో మార్మోగింది. ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ ఉన్న సినిమాలో కావ్య న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌తో మెప్పించింది. కావ్య అంద‌చందాలు ప్ర‌తిభ‌కు యువ‌త‌రం ఫిదా అయింది. అలాగే బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే రూపొందించిన 'ఫ‌ర్జీ'లో న‌టించి పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కించుకుంది.


కావ్య థాపర్ సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. లేటెస్ట్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తోంది. తాజాగా కావ్య షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ భామ ఫ్లోర‌ల్ డిజైన‌ర్ టాప్ లో ఎంతో అందంగా క‌నిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. ఈ బ్యూటీ స్ట‌న్నింగ్ లుక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.


ఉత్త‌రాదికి చెందిన కావ్య థాపర్ నటి కం మోడల్. తెలుగు- తమిళం- హిందీ చిత్రాలలో న‌టిస్తోంది. థాపర్ 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. ఆమె తన పాఠశాల జీవితాన్ని బాంబే స్కాటిష్ స్కూల్- పోవై నుండి పూర్తి చేసింది. పాఠశాల జీవితం పూర్తయిన తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ లో చేరింది. వినోద రంగంలో థాపర్ రంగ ప్ర‌వేశం అనూహ్యం. తత్కాల్ అనే హిందీ లఘు చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ పతంజలి- మేక్ మై ట్రిప్ - కోహినూర్ వంటి ప్రకటనలలో కూడా కనిపించింది. కావ్య న‌టించిన‌ తెలుగు సినిమా ఈ మాయ పేరేమిటో 2018లో విడుదలైంది. ఈ చిత్రం ఆమె మొదటి తెలుగు చిత్రం. 2019లో తమిళ చిత్రం మార్కెట్ రాజా ఎంబిబిఎస్ విడుదలైంది. ఈ చిత్రం ఆమె మొదటి తమిళ చిత్రం. సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన'లో, 'బిచ్చ‌గాడు' ఫేం విజ‌య్ ఆంథోనీ స‌ర‌స‌న‌ 'పిచైక్కారన్ 2'లోను కావ్య థాపర్ న‌టించింది.