Begin typing your search above and press return to search.

స్మైల్ తోనే హార్ట్ బీట్ పెంచుతూ..

గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన చిన్నారిని అంత వేగంగా ఎవ్వరూ మరిచిపోరు. ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ అయిన సంగతి అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Oct 2023 10:48 AM GMT
స్మైల్ తోనే హార్ట్ బీట్ పెంచుతూ..
X

గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన చిన్నారిని అంత వేగంగా ఎవ్వరూ మరిచిపోరు. ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ బ్యూటీనే కావ్యా కళ్యాణ్ రామ్. మసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అందుకున్న కావ్య తరువాత బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. తరువాత శ్రీసింహకి జోడీగా ఉస్తాద్ మూవీలో నటించింది.


ఈ చిత్రంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే నటిగా మాత్రం కావ్యాకి అవకాశాలు భాగానే వస్తున్నాయి. హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తోంది. హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమకి సంబందించిన రెగ్యులర్ అప్డేట్స్ ని ఫ్యాన్స్ తో పంచుకోవడంతో పాటుగా అప్పుడప్పుడు కాస్తా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు.

ఈ కారణంగానే అందాల భామలకి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కావ్య కళ్యాణ్ రామ్ మరీ నార్త్ ఇండియన్ హీరోయిన్స్ స్థాయిలో శృతి మించి అందాల ప్రదర్శన చేయదు కాని తన స్మైల్, కాళ్ళతో కుర్రాళ్ళ మనసులు దోచేస్తూ ఉంటుంది. పిల్లికల్ల పాప అంటూ కావ్యని చూస్తూ ఆమె ఫ్యాన్స్ డ్యూయెట్ లు కూడా పాడేసుకుంటారు.

అంతలా ఆమె అందం కుర్రాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే ఫోటోలని షేర్ చేసింది. స్వచ్చమైన నవ్వుతో మనసులని మెలిపెడుతూ, కాళ్ళతో చూపుల బాణాలు విసిరేస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కడుపునిండా పులిహోరా హ్యాపీ దసరా అంటూ రైమింగ్ తో ఫ్యాన్స్ కి విషెస్ చెప్పింది. దానికి అదనంగా ఇప్పుడు నా ఫోటోలపై మీరు ఏడుపు ఎమోజీలు వేయలేరుగా అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనికి నెటిజన్లు కూడా భిన్నంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అందమైన చిరునవ్వుతో చాలా క్యూట్ గా ఉన్నావ్ అంటూ పాజిటివ్ గా ఆమె అందానికి నెటిజన్లు ప్రశంసలు ఇస్తున్నారు.