Begin typing your search above and press return to search.

యానిమల్ ఆమెకు కూడా నచ్చలేదట

తాజాగా ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో లీడ్రోల్ చేస్తున్న కస్తూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 2:45 AM GMT
యానిమల్ ఆమెకు కూడా నచ్చలేదట
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మూవీ యానిమల్. ఈ సినిమా ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు చేసింది. ఓవర్సీస్ లో 15 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ పెర్ఫార్మన్స్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. సందీప్ రెడ్డి వంగా మేకింగ్ విజన్ పై అద్భుతమైన ప్రశంసలు లభించాయి.


అదే స్థాయిలో సినిమాపై విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో మూవీ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై సోషల్ మీడియా ప్రస్తుతం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య సీనియర్ యాక్టర్ రాధిక సినిమా పేరు ప్రస్తావించకుండా మూవీ పై విమర్శలు చేశారు. తాజాగా ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో లీడ్రోల్ చేస్తున్న కస్తూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

లాస్ట్ నైట్ సినిమా చూద్దామని స్టార్ట్ చేశా. ఒక అరగంట మూవీ చూసేసరికి బోర్ కొట్టింది. అసలు సినిమాని మూడున్నర గంటలకు థియేటర్ లో ప్రేక్షకులు ఎలా చూసారు. ఆటో ఫ్లయింగ్ ఫ్లైన్ లో ఆ సన్నివేశాలు, ప్రేమలో పడే సీన్స్, ఏమి కూడా నాకు నచ్చలేదు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. సినిమా టాప్ నాచ్ లో ఉంది.

ఆ స్థాయిని మనం అందుకోలేకపోయాం. మూవీలో చాలా ఉంది. కానీ నన్ను ఎంటర్టైన్ చేయలేదు అంటూ ట్విట్టర్ ఈ కస్తూరి పోస్ట్ పెట్టారు. అవి మాత్రమే కాకుండా చాలా మంది తమిళ్ ఆడియోస్ కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేస్తూ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై సందీప్ రెడ్డి వంగా ఎలా రియాక్ట్ అవుతాడు అనేది వేచి చూడాలి.

ఈ సినిమాని తక్షణం నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నయనతార అన్నపూర్ణీ మూవీని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో యానిమల్ కూడా భారతీయ సనాతన సాంప్రదాయాలను, స్త్రీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సినిమాని తొలగించాలంటూ ఎక్కువగా తమిళ్ ఆడియన్స్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు.