Begin typing your search above and press return to search.

అమ్మాయిల వీడియో పోస్ట్ చేసినందుకు న‌టిపై దాడి!

తాజాగా న‌టి క‌స్తూరి ఓ వీడియోని షేర్ చేసి అడ్డంగా బుక్కైంది. దీంతో విమ‌ర్శ‌లు..వివాదాల్లో ఇరుక్కోవాల్సి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   16 July 2023 8:15 AM GMT
అమ్మాయిల వీడియో పోస్ట్ చేసినందుకు న‌టిపై దాడి!
X

సెల‌బ్రిటీల‌పై ట్రోలింగ్ లు..విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మే. ఏదో ప‌ని విష‌యంలో అడ్డంగా దొరికిపోతే వాళ్ల ప‌ని ఇంక అంతే. ట్రోల‌ర్లు ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. అది ప‌నిగట్టుకుని చేయ‌కూడ‌ని ప‌నులేవైనా చేస్తే ఆ త‌ర్వాత స‌న్నివేశం పరాకాష్ట‌కే చేరుతుంది. తాజాగా న‌టి క‌స్తూరి ఓ వీడియోని షేర్ చేసి అడ్డంగా బుక్కైంది. దీంతో విమ‌ర్శ‌లు..వివాదాల్లో ఇరుక్కోవాల్సి వ‌చ్చింది. నెటి జ‌నుల సందేహాల‌కు బ‌ధులివ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్తే.

క‌స్తూరి ట్విట‌ర్లో ఓ ఇద్ద‌రు అమ్మాయిలు మ‌ద్యం కొంటున్న వీడియోను పోస్ట్ చేసింది. దీనికి 'అమ్మాయిలూ బాగా తాగండి ' అని కామెంట్ కూడా జ‌త చేసింది. దీంతో నెటి జ‌నులు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు.

ఆ అమ్మాయిల వ్యక్తిగత జీవితానికి చెందిన విషయాన్ని ఎందుకు షేర్ చేశారని కొంద‌రు ప్ర‌శ్నిస్తుండ‌గా? చాలా మందిని తప్పుదోవ పట్టించేలా మీ పోస్ట్ ఉందని మ‌రికొంత మంది విమ‌ర్శల దాడికి దిగారు.

అమ్మాయిలు మందు కొట్టాలని మీరు ప్రోత్సహిస్తున్నారా? లేక అమ్మాయిలు మ‌ద్యం కొన‌డం ఏంట‌ని? అని ప్ర‌శ్నిస్తున్నారా? మ‌హిళ‌ల‌కు అన్ని రంగాల్లో స‌మాన హ‌క్కులు కలిగి ఉన్న‌ప్పుడు మద్యం షాపులో మందు కొన‌గూడదా? వాళ్ల‌కు స్వేచ్ఛ‌గా సేవించే అర్హ‌త లేదా? అంటూ మండిప‌డుతున్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందుతోన్న దేశంలో ఇంకా ఇలాంటి ప‌నులు చేసి వెన‌క్కి లాగొద్దు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

క‌స్తూరి ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేం కాదు. గ‌తంలో నయనతార సరోగసీ పై కొన్ని కామెంట్లు చేసింది. అప్పుడు నెటి జ‌నులు క‌స్తూరి పై మండిప‌డ్డారు. ఆ త‌ర్వాత ఇటీవ‌లే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ పాత్ర.. ఏఆర్ రెహమాన్ భార్యకు తమిళం సరిగా రాదు అని..ఇలా పలు విషయాలపై మాట్లాడి విమర్శ‌లు ఎదుర్కున్నారు. ఆమె ప్ర‌చారం కోస‌మే ఇలాంటి ప‌నులు చేస్తుంద‌ని విమ‌ర్శించిన వారు మ‌రికొంత మంది. ప్ర‌స్తుతం ఆమె సినిమాల‌క‌న్నా ఎక్కువ‌గా సీరియ‌ల్స్ చేస్తున్నారు.