Begin typing your search above and press return to search.

కొత్త క‌రీనాని ప‌రిచ‌యం చేస్తుంది!

బాలీవుడ్ లో క‌రీనాక‌పూర్ ఖాన్ జర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది

By:  Tupaki Desk   |   6 Sep 2023 6:46 AM GMT
కొత్త క‌రీనాని ప‌రిచ‌యం చేస్తుంది!
X

బాలీవుడ్ లో క‌రీనాక‌పూర్ ఖాన్ జర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. దాదాపు అన్ని జాన‌ర్ చిత్రాలు చేసింది. న‌టిగా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీని వేసింది. న‌వ నాయిక‌ల పోటీని పైతం త‌ట్టుకుని యువ హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. ఓటీటీలో నూ అల‌రించ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. తోటి న‌టులంతా ఇప్ప‌టికే ఓటీటీలో ఏల్తోన్న నేప‌థ్యంలో తాజా చిత్రం 'జానే జాన్' నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా ట్రైల‌ర్ ఇట‌వ‌లే రిలీజ్ అయి ఆక‌ట్టుకుంది. ఓ ఒంట‌రి మ‌హిళ‌..ఉపాధ్యాయుడు..పోలీస్ జీవితాల్ని అన్వేషిస్తూ మొద‌లైన ట్రైల‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగుతుంది. తాజాగా ఈ సినిమాలో క‌రీనా క‌పూర్ పాత్ర గురించి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అమ్మ‌డు ఇంత‌వ‌ర‌కూ క్రైమ్ థ్రిల్ల‌ర్ లో న‌టించ‌లేదుట‌. 'జానే జాన్' తో ఆ అనుభ‌వం పొందిందిట‌. ఇందులో క‌రీనా పాత్ర ఓ కొత్త కోణంలో సాగుతుందిట‌.

అమ్మ‌డి పాత్ర‌లో నెగిటివిటీ ఉంటుంద‌ని తెలుస్తోంది. భ‌ర్త‌ని హ‌త్య చేసిన మాయ అనే మ‌హిళ ఆ ర‌హస్యాన్ని దాచి పెట్ట‌డానికి ఎలాంటి ప్ర‌యత్నాలు చేస్తుంది? అనే అంశాన్ని ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్నారు. స‌భ్య‌స‌మాజంలో ఇలాంటి వాస్తవ సంఘ‌ట‌న‌లు ఎన్నో నిత్యంచోటు చేసుకుంటున్నాయి. అక్ర‌మ సంబంధాల‌తో భ‌ర్త‌ల్ని చంపిన భార్య‌లున్నారు...భార్య‌ల్నిచంపిన భ‌ర్త‌లున్నారు.

ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క‌రీనాకి ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో క‌థ అంతా ఆమె పాత్ర చుట్టూనే ఎక్కువ‌గా తిరుగుతుంద‌ని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాని క‌రీనా ఎంతో ప్ర‌త్యేకంగా భావిస్తోంది. సినిమా హిట్ అయితే క‌రీనా ఇమేజ్ రెట్టింపు అవుతుంద‌ని ఆశిస్తుంది. ఈనెల 21న రిలీజ్ అవుతోన్న సినిమా కోసం తాను కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపింది.