Begin typing your search above and press return to search.

జగతి మేడం స్టన్నింగ్.. పవన్ సాంగ్ కు అలా చేస్తూ!

జ్యోతి రాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:08 PM GMT
జగతి మేడం స్టన్నింగ్.. పవన్ సాంగ్ కు అలా చేస్తూ!
X

జ్యోతి రాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆ సీరియల్ లో జగతిగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. చీరకట్టుతో అమ్మ పాత్రలో, టీచర్ పాత్రలో ఒదిగి పోయింది. ప్రస్తుతం సీరియల్ లో ఆమె పాత్ర చనిపోయింది. దీంతో ఈ అమ్మడు.. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా గడుపుతోంది.

సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటోంది. స్కిన్ షోతో విపరీతంగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటోంది. కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. డైలీ తన సోషల్ మీడియా వాల్ చెక్ చేయాలనేంతలా పోజులిస్తుంటోంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సింగిల్ పీస్ వైట్ కలర్ డ్రెస్ వేసిన ఈ అమ్మడు.. సోఫాలో కూర్చుని కొంటె చూపులతో సోషల్ మీడియాను అల్లాడిస్తోంది. చేతిలో వైన్ గ్లాస్ తో చిల్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కల్యాణ్ సినిమాలోని ఇట్స్ టైమ్ టూ పార్టీ నౌ సాంగ్ ను యాడ్ చేసింది. నాన్ ఆల్కహలిక్ డ్రింక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బాగా పార్టీ చేసుకోండి మేడం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్న జ్యోతి రాయ్.. ఇటీవల తన రెండో మ్యారేజ్ పై క్లారిటీ ఇచ్చింది. యంగ్ డైరెక్టర్ పూర్వాజ్ ను రెండో పెళ్లి చేసుకున్నట్లు పరోక్షంగా తెలిపింది. పూర్వాజ్ బర్త్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ తో పెళ్లి విషయాన్ని పంచుకుంది. ఆ సమయంలో నెటిజన్లు వారికి కంగ్రాట్స్ తెలిపారు. ఏ మాస్టర్ పీస్ సినిమాను పూర్వాజ్ తెరకెక్కిస్తుండగా.. జ్యోతి రాయ్ నటిస్తోంది.

ఆ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్లపాటు సీరియళ్లు చేసిన జ్యోతి రాయ్.. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ మూవీతో పాటు నో మోర్ సీక్రెట్స్ , ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌ లలో యాక్ట్ చేస్తోంది. అయితే ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ లోని జ్యోతి రాయ్ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించింది. మరి జ్యోతి రాయ్ కొత్త మూవీ, వెబ్ సిరీస్ లు ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.