Begin typing your search above and press return to search.

రెడ్ అలెర్ట్‌: జాన్వీ జంత‌ర్ మంత‌ర్

శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో ఠ‌ఫ్‌ కాంపిటీట‌ర్ అన‌డంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:32 AM GMT
రెడ్ అలెర్ట్‌: జాన్వీ జంత‌ర్ మంత‌ర్
X

శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో ఠ‌ఫ్‌ కాంపిటీట‌ర్ అన‌డంలో సందేహం లేదు. న‌టిగా లేదా ఫ్యాష‌నిష్టాగా ఈ భామ‌కు సాటిలేరు ఎవ‌రూ. సారా అలీఖాన్, అన‌న్య పాండే లాంటి న‌ట‌వార‌సురాళ్లు బ‌రిలో ఉన్నా కానీ జాన్వీ క‌పూర్ స్పీడ్ ముందు వీళ్లెవ‌రూ క‌నిపించ‌డం లేద‌నే చెప్పాలి. ముఖ్యంగా బోల్డ్ అండ్ డ‌స్కీ ఫోటోషూట్ల‌తో ఇంట‌ర్నెట్ ని షేక్ చేయ‌డంలో జాన్వీ ఎప్పుడూ ముందుంటోంది. ఈ భామ స్ట‌న్నింగ్ ఫోటోషూట్లు ఎప్ప‌టిక‌ప్పుడు నెట్‌లో అగ్గి రాజేస్తూనే ఉన్నాయి.


అలాంటి మ‌రో ఫోటోషూట్ ఇప్పుడు అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ క‌పూర్ రెడ్ హాట్ లుక్ కి సంబంధించిన చ‌ర్చ వేడెక్కిస్తోంది. తాజాగా ఎరుపు రంగు లెదర్ డ్రెస్‌లో జాన్వీ హొయ‌లు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ఫోటోగ్రాఫ్స్ లో జాన్వీ త‌డిపొడి త‌మ‌కం యూత్ ని క‌వ్విస్తోంది. వెట్టీ హెయిర్ .. స్మోకీ ఐస్..మెరిసే అందంతో జాన్వీ గురుత్వాక‌ర్ష‌ణ‌కే స‌వాల్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది.


ప్ర‌స్తుతం ఎన్టీఆర్ స‌ర‌స‌న 'దేవ‌ర' చిత్రంలో న‌టిస్తున్న జాన్వీ త‌దుప‌రి టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించేందుకు ఆసక్తిగా ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్ ని తెర‌కెక్కిస్తే బ‌హుశా జాన్వీకి అవ‌కాశం ఉంటుంది. త‌దుప‌రి బ‌న్ని, మ‌హేష్, ప్ర‌భాస్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌నా న‌టించేందుకు జాన్వీ ఆస‌క్తిగా ఉంది. మ‌రోవైపు కోలీవుడ్ లోను స‌రైన అవ‌కాశం వ‌రిస్తే న‌టించేందుకు సిద్ధ‌మేన‌ని జాన్వీ స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు, బాలీవుడ్ ని ఈ బ్యూటీ బ్యాలెన్స్ చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది.