Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కుర్ర‌బ్యూటీ మ‌త్తుక‌ళ్ల జాన్వీ

మ‌రోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ స‌ర‌స‌న జాన్వీ 'దేవర' షూటింగ్ లో పాల్గొంటోంది

By:  Tupaki Desk   |   14 Dec 2023 5:09 AM GMT
ఫోటో స్టోరి: కుర్ర‌బ్యూటీ మ‌త్తుక‌ళ్ల జాన్వీ
X

త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకెళుతోంది జాన్వీ కపూర్. మామ్ శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా సినీరంగ ప్ర‌వేశం చేసిన జాన్వీ త‌దుప‌రి త‌న‌దైన శైలి, విల‌క్ష‌ణ‌ ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో జాన్వీ క‌పూర్ కి అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. జాన్వీ నిరంత‌ర ఫోటోషూట్లు, వీడియో షూట్ల‌కు భారీగా యువ‌త‌రంలో ఫాలోయింగ్ ఉంది.


తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో చ‌ర్చ‌గా మారింది. జాన్వీ మిరుమిట్లు గొలిపే ఫ్రాక్ ధ‌రించి నీళ్ల‌లో కిల్ల‌ర్ భంగిమ‌ల‌తో మ‌తులు చెడ‌గొట్టింది. త‌డిపొడి దేహ‌శిరులు.. మ‌త్త‌క‌ళ్ల‌తో చిత్తు చేసింది ఈ కుర్ర‌బ్యూటీ. ఈ ఫోటోల‌ను వీక్షించిన యువ‌త‌రం 'మ‌త్తు క‌ళ్ల జ‌వానీ!' అంటూ జాన్వీకి కితాబిచ్చేస్తున్నారు. డార్క్ థీమ్‌లో వెట్ లుక్ లో క‌నిపించిన జాన్వీక‌పూర్ అందానికి ఫిదా అయిపోతున్నారంతా. ఓర చూపుల‌తో వ‌ల‌లు విసిరిన జాన్వీ కుర్ర‌కారుకు మైకం క‌మ్మేంత‌గా క‌వ్విస్తోందంటూ బోయ్స్ కామెంట్లు విసురుతున్నారు.


మ‌రోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ స‌ర‌స‌న జాన్వీ 'దేవర' షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాపైనే ఈ బ్యూటీ ఫోక‌స్ అంతా. త‌న తెలుగు సినిమా డెబ్యూని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోంది జాన్వీ క‌పూర్. దేవ‌ర కోసం ఇటీవ‌ల బాలీవుడ్ సినిమాల‌ను కూడా త‌గ్గించుకుంది. ఇక దేవ‌ర చిత్రాన్ని కొర‌టాల‌ రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.