Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈ కిల్ల‌ర్ భంగిమ చూసారా?

అందానికి అందం ప్ర‌తిభ‌తో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ సినీయ‌వ‌నిక‌పై దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   3 Dec 2023 5:03 AM GMT
ఫోటో స్టోరి: ఈ కిల్ల‌ర్ భంగిమ చూసారా?
X

అందానికి అందం ప్ర‌తిభ‌తో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ సినీయ‌వ‌నిక‌పై దూసుకుపోతోంది. డే బై డే ఈ బ్యూటీ ప‌రిణ‌తి చెందిన న‌ట‌న‌, ఫ్యాష‌న్ సెన్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. జాన్వీ తదుపరి 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'లో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించింది. ధర్మ ప్రొడక్షన్స్ ఇటీవల తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త విడుదల తేదీని ప్రకటించింది. 19 ఏప్రిల్ 2024న 'మిస్ట‌ర్ అండ్ మ‌హి' థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.


జాన్వీ నటిస్తున్న ప్ర‌తి సినిమా క‌థాంశం దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన‌ది. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ఒక స్పోర్ట్స్ డ్రామా . రూహి తర్వాత జాన్వీ - రాజ్‌కుమార్‌ల కలయికలో రెండో చిత్రమిది. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. త‌దుప‌రి భారీత‌నం నిండిన క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్- సైఫ్ అలీఖాన్‌లతో పాటు జాన్వీ కనిపించనుంది. దేవ‌ర అనేది ఈ సినిమా టైటిల్. దీనిని రెండు భాగాలుగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. జాన్వీ టాలీవుడ్ డెబ్యూపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దీనిపై శ్రీ‌దేవి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

వైవిధ్యం కేవ‌లం కెరీర్ ప‌రంగానే కాదు.. ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగానూ ప్ర‌ద‌ర్శిస్తోంది జాన్వీక‌పూర్. ఈ యంగ్ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్లు యువ‌త‌రంలో వేవ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బికినీలు చిట్టి పొట్టి దుస్తుల్లో జాన్వీ హొయ‌లు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఇప్పుడు అందుకు భిన్నంగా సోఫాలో వేడెక్కించే భంగిమ‌ల‌తో మైండ్ బ్లాంక్ చేసింది జాన్వీ. ఉలెన్ సోఫాలో క్రీగంటి చూపులతో కిల్ చేస్తూ అంద‌మైన స్మైల్ తో క‌వ్విస్తోంది జాన్వీ. ఎంపిక చేసిన టాప్ కుర్ర‌బ్యూటీ అందాల‌ను ఆవిష్క‌రిస్తుండ‌గా, బాట‌మ్ లో ఆ చార‌ల‌ ఫ్యాంట్ ఎంతో డీసెంట్ గా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. గ‌త రెండేళ్లుగా మాల్దీవుల నుంచి జాన్వీ క‌పూర్ స్పెష‌ల్ బికినీ షూట్లు యువ‌త‌రం కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చాయి. మ‌రోసారి అలాంటి ట్రీట్ కోసం ఇప్పుడు అంతా వేచి చూస్తున్నారు. దేవ‌ర షూటింగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాంటి మ‌రో ట్రీట్ ని ఆశిస్తున్నారు.