Begin typing your search above and press return to search.

శ్రీవల్లి.. రామలక్ష్మి.. ఆ రేంజ్ లో తంగం క్లిక్కయ్యేనా?

ఫిషర్ మెన్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిగా జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది

By:  Tupaki Desk   |   1 Nov 2023 4:11 AM GMT
శ్రీవల్లి.. రామలక్ష్మి.. ఆ రేంజ్ లో తంగం క్లిక్కయ్యేనా?
X

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా దేవర సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఇస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమానే జాన్వీ కెరియర్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ కూడా కావడం విశేషం.


కొరటాల శివ ఏరికోరి మరీ జాన్వీ కపూర్ ని ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఫేవరేట్ కో స్టార్ అని గతంలో చాలా సందర్భాలలో చెప్పింది. దీంతో తారక్ కి జోడీగా నటించే ఛాన్స్ రావడం ఆమె కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పోషించే పాత్ర ఎలా ఉండబోతోంది అనేది గతంలోనే ఫస్ట్ లుక్ తో రివీల్ చేశారు.

తాజాగా సినిమాలో ఆమె లుక్ కి సంబందించిన మరో స్టిల్ ని చిత్ర యూనిట్ వదిలింది.ఓణీ కట్టుకొని అచ్చమైన పల్లెటూరి పడుచుపిల్లలా కనిపిస్తోన్న జాన్వీ కపూర్ దేవర సినిమాలోని అద్భుతమైన లుక్ ఇదే అంటూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషిస్తున్న పాత్ర పేరు తంగం అని కూడా కన్ఫర్మ్ చేశారు.

ఫిషర్ మెన్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిగా జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్ లో జాన్వీ కపూర్ తంగం లుక్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. జాన్వీ కపూర్ లుక్ చూసిన తర్వాత కచ్చితంగా సినిమాలో ఆమెకి బలమైన పాత్ర పడిందనే మాట వినిపిస్తోంది.

రంగస్థలంలో రామలక్ష్మి, పుష్పలో శ్రీవల్లి పాత్రలు కూడా ఇలాగే పక్కా పల్లెటూరి పిల్ల తరహాలో ఉంటాయి. ఈ పాత్రలు ఆయా సినిమాలలో ఎంత అద్భుతంగా పండాయో అందరికి తెలిసిందే. రామలక్ష్మి క్యారెక్టర్ తో సమంతకి ఊహించని ఇమేజ్ వచ్చింది. శ్రీవల్లిగా రష్మిక ఇండియన్ వైడ్ గా పాపులర్ అయిపొయింది. ఇప్పుడు తంగంగా జాన్వీ కపూర్ కూడా అలాంటి ఇమేజ్ ని సొంతం చేసుకుంటుదేమో చూడాలి.