Begin typing your search above and press return to search.

'దేవర' రాణి అందాల మాయ

రాబోయే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా దేవరతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న జాన్వీ కపూర్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి

By:  Tupaki Desk   |   27 Sep 2023 11:32 AM GMT
దేవర రాణి అందాల మాయ
X

రాబోయే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా దేవరతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న జాన్వీ కపూర్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అమ్మడికి ఒక పర్ఫెక్ట్ సక్సెస్ కూడా రాలేదు. అయినప్పటికీ కూడా ఆమె గ్లామర్ తోనే తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. ఇక ఈ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాలో ఛాన్స్ దక్కింది.


ఒక విధంగా ఇది ఆమెకు చాలా అదృష్టం అనే చెప్పాలి. ఈ సినిమా తోనే ఆమె భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఇంత పెద్ద సినిమాతో ఆమెకు సక్సెస్ అందితే మరొక లెవెల్ కు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇక అమ్మడు తన గ్లామర్ తో ఎప్పుడు కూడా ఫాలోవర్స్ కు మంచి కిక్ అయితే ఇస్తూ ఉంటుంది.

రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు చూస్తే స్టన్ అవ్వాల్సిందే. కలర్ఫుల్ డ్రెస్లతో అమ్మడు సూర్యోదయం అలాగే సూర్యాస్తమయంలో చాలా అందమైన స్టిల్స్ అయితే ఇచ్చింది. ఈ అందాల రాణి దేవర సినిమాలో ఎ విధంగా కనిపిస్తుందా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఆ మధ్య సినిమాకు సంబంధించిన స్టిల్ ను బట్టి ట్రెడిషినల్ గానే కనిపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. జాన్వీ కపూర్ చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఇంకా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే ఒక మరొక సినిమా అయితే చేస్తోంది.

ఇప్పటివరకు దేవర సినిమా షూటింగ్లో పాల్గొనని అమ్మడు ఇక అక్టోబర్లో మొదలయ్యే షెడ్యూల్లో మాత్రం ఒక నెలపాటు బిజీ కానుంది. దేవర సినిమాలో ఆమె క్యారెక్టర్ కథకు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.