Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ కొత్త పిక్ చూసారా? అందం అంటే ఇది!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హాట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:38 AM GMT
జాన్వీ కపూర్ కొత్త పిక్ చూసారా? అందం అంటే ఇది!
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హాట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ అఫిషిల్ ఇండియా అకౌంట్ లో జాన్వీ కపూర్‌ హాట్ ఫోటోలను షేర్‌ చేయడం జరిగింది. జాన్వీ కపూర్ చేసిన వెబ్‌ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్‌ లో భాగంగా ఈ ఫోటోలను షేర్‌ చేశారు.


ఒక వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మరో వైపు తెలుగు సినిమా ల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. దేవర సినిమా తర్వాత తెలుగు లో మరో సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందట. ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు కానీ కచ్చితంగా జాన్వీ కపూర్‌ తెలుగు లో మరిన్ని సినిమాలు చేయబోతుందని టాక్.

తాజా ఫోటో షూట్‌ లో క్లీ వేజ్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుకు వంగి మరీ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అతిలోక సుందరి అంటూ తల్లికి ఉన్న బిరుదు కు తాను పూర్తిగా అర్హురాలిని అని నిరూపించుకునేందుకు సాధ్యం అయినంతగా కృషి చేస్తోంది.

తాజా ఫోటో షూట్ తో జాన్వీ కపూర్ మళ్లీ వైరల్‌ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు హిందీలో చాలా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇప్పటి వరకు కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ని అందుకోవడంలో విఫలం అయింది. తెలుగు లో చేస్తున్న దేవర సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ లో మొదటి హిట్ కొట్టి ఆ తర్వాత అన్ని భాషల్లో శృతి హాసన్ మాదిరిగా దూసుకు వెళ్తుందేమో చూడాలి.