Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ త‌ర్వాత జాన్వీక‌పూర్ హీరో అత‌నే!

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల తన‌య జాన్వీక‌పూర్ దేవ‌ర సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Aug 2023 6:25 AM GMT
ఎన్టీఆర్ త‌ర్వాత జాన్వీక‌పూర్ హీరో అత‌నే!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల తన‌య జాన్వీక‌పూర్ 'దేవ‌ర' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ అవ‌కాశం ప‌ట్ల జాన్వీ ఎప్పుడూ ఎక్క‌డా ఓపెన్ అవ్వ‌లేదు. కేవ‌లం తెలుగు సినిమా చేస్తుంద‌నే ప్ర‌చారం త‌ప్ప‌! ఆ సినిమా ఎంత ఇష్ట‌ప‌డి చేస్తుంది? టాలీవుడ్ లో అభిమాన హీరో ఎవ‌రు? వంటి వివ‌రాలు పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు. తాజాగా ఓ సంద‌ర్భంలో టాలీవుడ్ లో త‌న తొలి ఛాయిస్ ఎవ‌రు? అంటే ట‌క్కున ఎన్టీఆర్ పేరు చెప్పింది.

ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించాల‌నే కోరిక ఎప్ప‌టి నుంచో ఉంది. అది దేవ‌ర‌తో తీరుతుంది. అలాగే బాలీవుడ్ నుంచి చూస్తే ర‌ణ‌బీర్ క‌పూర్ తో రొమాన్స్ చేయాల‌ని తెలిపింది. బాలీవుడ్ లో యంగ్ హీరోలంతా ఓ ఎత్తైతే ర‌ణ‌బీర్ మాత్రం స‌మ్ థింగ్ స్పెష‌ల్. అత‌నితో వీలైనంత త్వ‌ర‌గా సినిమా చేయాలంది. త్వ‌ర‌లోనే ఆ అవ‌కాశం వ‌స్తుంద‌ని అంది. ఇంకా హిందీ హృతిక్ రోష‌న్..టైగ‌ర్ ష్రాప్.. ర‌ణ‌వీర్ సింగ్ ల‌తోనూ క‌లిసి ప‌నిచేయాల‌నుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక ఎలాంటి ద‌ర్శ‌కులతో ప‌నిచేయాల‌ని ఉందంటే? 'నీర‌జ్ ఘోవాన్..సంజ‌య్ లీలా భ‌న్సాలీ..క‌ర‌ణ్ జోహార్ ల‌తో ప‌నిచేయాల‌ని ఉంది. వాళ్ల‌తో ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోను. ఎంత బిజీగా ఉన్నా డేట్లు అడ్జెస్ట్ చేస్తాను.ఎందుకంటే ఆ ముగ్గురు నా అభిమాన ద‌ర్శ‌కులు' అంది. ఇంకా తెలుగులో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌తో కూడా సినిమాలు చేయాల‌ని ఉంద‌ని గ‌తంలో తెలిపింది. మ‌హేష్ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా పొగిడేసింది. వ‌య‌సు ముదిరే కొద్ది మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా మారిపోతున్నారంటూ న‌వ్వేసింది.

జాన్వీ హిందీ సినిమాల లైన‌ప్ చూస్తే రాజ్ కుమార్ రావ్ తో 'మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి'లో న‌టిస్తోంది. 'ఉలాజ్' అనే మ‌రో సినిమా కూడా సెట్స్ లో ఉంది. విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఓ సినిమాతో కోలీవుడ్ లో కూడా లాంచ్ అవుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.