Begin typing your search above and press return to search.

ఇవానా ఆ సినిమాతో టాప్ లీగ్ లోకి వెళ్తుందా..!

తెలుగు తెర మీద చెన్నై భామల డిమాండ్

By:  Tupaki Desk   |   24 July 2023 8:08 AM GMT
ఇవానా ఆ సినిమాతో టాప్ లీగ్ లోకి వెళ్తుందా..!
X

తెలుగు తెర మీద చెన్నై భామల డిమాండ్ అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో తమిళ హీరోయిన్స్ హవా ఓ రేంజ్ లో ఉంటుంది. రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ తెలుగులో సినిమాలు చేస్తుంది. ఇక ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత తన కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఇదే బాటలో మరో చెన్నై భామ తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఆల్రెడీ ఒక డబ్బింగ్ సినిమాతో ఇక్కడ యూత్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ అమ్మడి ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో అలరించడానికి రెడీ అవుతుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే లవ్ టుడే హీరోయిన్ ఇవానా. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన ఇవానా జివి ప్రకాష్ నాచియార్ తో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా తర్వాత శివ కార్తికేయన్ హీరో మూవీలో సైడ్ రోల్ చేసిన ఇవానా మళ్లీ లవ్ టుడేతో సోలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. లవ్ టుడే హిట్ ఆమెకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తుంది. అక్కడ కోలీవుడ్ లో కూడా ఛాన్స్ లు వస్తుండగా లవ్ టుడే సినిమాని తెలుగులో రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు ఆమెకు తెలుగులో క్రేజీ ఆఫర్ ఇచ్చాడు.

తన ఫ్యామిలీ హీరో ఆశిష్ లీడ్ రోల్ లో చేస్తున్న సెల్ఫిష్ సినిమాలో ఇవానాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే సెల్ఫిష్ నుంచి వచ్చిన సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచాయి. సినిమాలో ఇవానా పాత్ర చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. సెల్ఫిష్ లో మెయిన్ ఎట్రాక్షన్ ఇవానా అని టాక్. లవ్ టుడేతో ఇవానాకి యూత్ లో క్రేజ్ చూసి ఆమె ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని అనుకున్నారు.

సెల్ఫిష్ తో ఆమెను టాప్ లీగ్ లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు ప్లానింగ్ అంటే కచ్చితంగా దాని లెక్క వేరేలా ఉంటుంది. సెల్ఫిష్ తో పాటుగా ఇవానాని మరో రెండు సినిమాలకు కూడా దిల్ రాజు హీరోయిన్ గా అగ్రిమెంట్ చేయించుకున్నాడని టాక్.

సెల్ఫిష్ హిట్ పడితే ఇవానకి తెలుగులో ఫాలోయింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. తెలుగులో హీరోయిన్స్ లోటుని భర్తీ చేసేందుకు స్టార్ హీరోల సినిమాల్లో కూడా కొత్త హీరోయిన్స్ ని ప్రయత్నిస్తున్నారు మేకర్స్. సెల్ఫిష్ హిట్ పడితే ఇవానా కూడా స్టార్ ఛాన్స్ తెచ్చుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.