Begin typing your search above and press return to search.

దెయ్యం గా భయపెట్టబోతున్న దేశముదురు బ్యూటీ

తెలుగు ప్రేక్షకులకు దేశ ముదురు సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలతో బిజీగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 8:16 AM GMT
దెయ్యం గా భయపెట్టబోతున్న దేశముదురు బ్యూటీ
X

తెలుగు ప్రేక్షకులకు దేశ ముదురు సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ కమర్షియల్‌ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. హీరోయిన్ గా హన్సిక త్వరలో 'గార్డియన్‌' అనే హర్రర్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శబరి మరియు గురు శరవణన్‌ దర్శకద్వయం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హన్సిక ను ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో చూపించబోతున్నట్లుగా మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడం ద్వారా సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ దెయ్యం సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా 'గార్డియన్‌' సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయడం జరిగింది. హన్సిక ఒక సాధారణ అమ్మాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఒక ఆత్మ తో పీడింపబడుతుంది. దాంతో హన్సిక దెయ్యం గా మారి తాను అనుకున్నది చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో హన్సిక కు పలు షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి అని టీజర్ లో చూపించారు.

ప్రముఖ దర్శకుడు విజయ్‌ చందర్‌ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సామ్‌ సిఎస్ సంగీతాన్ని అందించాడు. తాజాగా టీజర్ ను విడుదల చేయడం ద్వారా అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. హన్సిక కి ఇక్కడ కూడా మంచి గుర్తింపు ఉంది. కనుక గార్డియన్ ను తెలుగు లో కూడా విడుదల చేస్తారేమో చూడాలి.