Begin typing your search above and press return to search.

పాపం చిట్టికి మరోసారి నిరాశ!

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:20 AM GMT
పాపం చిట్టికి మరోసారి నిరాశ!
X

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ అమ్మడు హీరోయిన్‌ గా మొదటి సినిమాతోనే సక్సెస్ సొంతం చేసుకున్నా కూడా ఆశించిన స్థాయిలో వరుస ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. రావణాసుర లో ముఖ్య పాత్రలో కనిపించినా కూడా ఆ సినిమా ఫరియా కి పెద్దగా ఆఫర్లు తెచ్చి పెట్టలేక పోయింది.

సోగ్గాడే చిన్ని నాయన సినిమా లోనూ మెరిసిన ఫరియా అబ్దుల్లా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకోవడం లో విఫలం అయింది. సినిమా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాని ఫరియా తాజాగా వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ వెబ్‌ సిరీస్ 'జంగబూరు కర్స్‌' లో ముఖ్య పాత్రలో నటించింది.

మైనింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్‌ లో ఈ సిరీస్ ను రూపొందించారు. లండన్ లో ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ గా పని చేసే ప్రియా దాస్‌ పాత్రలో ఫరియా అబ్దుల్లా నటించింది. తన తండ్రి కిడ్నాప్ అయ్యాడనే సమాచారం తో ఇండియాకు వచ్చిన ప్రియా దాస్‌ ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎలా ఎదుర్కొంది.. తన తండ్రిని ఎలా కనిపెట్టుకుంది అనేది కథ.

ప్రియా దాస్ పాత్రకు ఫరియా పూర్తి న్యాయం చేసినట్లుగా నటించింది. అయితే కథ మరియు కథనం చాలా స్లో గా అనిపించడం తో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. చిట్టి పాత్ర తో మెప్పించినా కూడా కథనం విషయంలో నిరాశ పరిచింది. దాంతో ఈ సిరీస్ కూడా ఫరియా అబ్దుల్లా కి నిరాశ మిగిల్చినట్లే అని... ఆఫర్లు అందుకోవడం కష్టం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.