Begin typing your search above and press return to search.

లోదుస్తుల‌తో మ‌ళ్లీ చెల‌రేగిన దిశా

తన ఇన్‌స్టాలో దిశా పటానీ ఒక అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్‌ని షేర్ చేసింది. నలుపు రంగు ఫుల్ స్లీవ్ టాప్ - మ్యాచింగ్ బ్రీఫ్ తో దిశా పటానీ ఫోజులిచ్చింది

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:44 AM GMT
లోదుస్తుల‌తో మ‌ళ్లీ చెల‌రేగిన దిశా
X

బోల్డ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో మ‌తులు చెడ‌గొట్ట‌డం దిశా ప‌టానీకి కొత్తేమీ కాదు. 2020 నుంచి ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ ఇన్న‌ర్ దుస్తుల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా కొన‌సాగుతోంది. అగ్గి రాజేసే బాడీ హ‌గ్గింగ్ ఔట్ ఫిట్ ల‌తో కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది. ప్రతిసారీ కెల్విన్ క్లెయిన్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా మ‌రోసారి సీకే బ్యూటీ దిశా సోషల్ మీడియాలో వేడిని పెంచుతోంది.


తన ఇన్‌స్టాలో దిశా పటానీ ఒక అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్‌ని షేర్ చేసింది. నలుపు రంగు ఫుల్ స్లీవ్ టాప్ - మ్యాచింగ్ బ్రీఫ్ తో దిశా పటానీ ఫోజులిచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో టోన్డ్ బాడీని స్టైలిష్‌గా ప్ర‌ద‌ర్శించింది. చాలా సింపుల్ గా ఒక బ్లాక్ హార్ట్ ఈమోజీని ఈ ఫోటోషూట్ తో పాటు షేర్ చేసింది. దీనికి స్పందిస్తూ దిశా స్నేహితురాలు మౌని రాయ్ వెంటనే ఫైర్ ఎమోజీలను షేర్ చేసారు. ప‌లువురు అభిమానులు కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. ``ఇది ఫిబ్రవరిలో మ‌రీ వేడిగా ఉంది`` అని వ్యాఖ్యానించ‌గా, మరొకరు `బాలీవుడ్‌లో మీకు అత్యుత్తమ వ్యక్తిత్వం ఉంది`` అని వ్యాఖ్యానించారు. మూడవ అభిమాని ``మీ అంత హాట్ ఎవరూ లేరు`` అని పొగిడేశాడు.


ఆదిత్య రాయ్ కపూర్‌తో జంట‌గా నటించిన మళంగ్ చిత్రం శుక్రవారంతో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున, ఈ మైలురాయిని సెల‌బ్రేట్ చేసుకోవడానికి దిశా తన ఇన్‌స్టాలోకి వెళ్లింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రంలో సారా నంబియార్ పాత్రలో దిశా పటాని నటించింది. దిశా - ఆదిత్య కాకుండా, మళంగ్‌లో అనిల్ కపూర్, ఖునాల్ ఖేము త‌దిత‌రులు న‌టించారు. విడుదలైన 4 సంవత్సరాలకు గుర్తుగా, దిశా ఈ చిత్రం నుండి ఒక స్టీమీ స్టిల్‌ను షేర్ చేసింది. ఆదిత్య రాయ్ కపూర్ ను ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఇది.

ఇత‌ర కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం ప్రాజెక్ట్ కేలో క‌నిపించ‌నుంది. దిశా పాత్ర‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి లీక్ లు రాలేదు. సాగర్ అంబ్రే - పుష్కర్ ఓజా కాంబినేష‌న్ లో రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా `యోధా`లో దిశా కనిపిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా - రాశి ఖన్నాతో పాటు ఈ చిత్రంలో తెర‌పై క‌నిపిస్తుంది.