Begin typing your search above and press return to search.

బికినీలో దిశా పటానీ గ్లామర్ బ్లాస్ట్

టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్‌.. దిశా పటానీని లోఫర్‌ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశారు

By:  Tupaki Desk   |   14 Jan 2024 10:41 AM GMT
బికినీలో దిశా పటానీ గ్లామర్ బ్లాస్ట్
X

బాలీవుడ్‌ బోల్డ్‌ అండ్‌ బ్యూటీస్‌ లో దిశా పటానీకి ప్లేస్ పక్కాగా ఉంటుంది. మూడు పదుల పరువాల భామ తన 8 ఏళ్ల నట జీవితంలో మంచి పేరే సంపాదించింది. మోడలింగ్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ నార్త్ బ్యూటీ హీరోయిన్ గా పరిచయమైంది మాత్రం తెలుగు చిత్రం కావడం విశేషం.


టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్‌.. దిశా పటానీని లోఫర్‌ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 2015లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి దశ తిరిగింది మాత్రం ఎంఎస్‌ ధోనీ ది అన్‌ టోల్డ్‌ స్టోరీ మూవీతోనే. ఆ సినిమా తర్వాత ఆమె జోరు అస్సలు తగ్గలేదు.


బాలీవుడ్‌లో టాప్ స్టార్స్‌ చిత్రాల్లో నటించే అవకాశాలు ఆమెకు క్యూ కట్టాయి. గ్లామర్‌ విషయంలో తగ్గేదే లే అంటూ ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. డాన్స్‌లోనూ దిట్టే. ఇక టాలెంట్ అంటారా? అంతకు మించే. అందుకే తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ, చైనీస్‌, తమిళంలో నటిగా చుట్టేసింది. చైనీస్‌ భాషలో వరల్డ్‌ సూపర్‌స్టార్‌ జాకీచాన్‌కు జంటగా కుంగ్‌ ఫూ చిత్రంలో నటించి పాన్‌ వరల్డ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీ గా ఉంది.

అయితే తన అందాలతో గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో ఈ బ్యూటీ ముందు వరుసలో ఉంటుంది. తరచూ బికినీల్లో కనిపిస్తూ అభిమానుల మతి పోగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన కొత్త ఫొటోస్ నెట్టింట హీటు పెంచాయి. వాటర్ షవర్ కింద అందాల సునామీ సృష్టించింది. స్క్రై బ్లూ కలర్ బికినీలో ఘాటు ఫోజులిస్తూ అదరగొట్టేసింది.

దిశాపటానీ పోజులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. బికినీలో అదరగొట్టడం తన తర్వాత ఎవరైనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మడి పోజులపై రొమాంటిక్ బాణాలు విసురుతూ రచ్చ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దిశా పటానీ క్రేజే వేరు అని ఆమె ఫాలోవర్స్ సంఖ్య చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

యాక్టింగ్ కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే బాగా గుర్తింపు పొందింది దిశా పటానీ. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో దిశ డేటింగ్ వ్యవహారం బాలీవుడ్‌లో ఎప్పటికీ హాట్ టాపికే. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ వైరల్ గా మారాయి. మరోవైపు, ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో దిశా పటానీ లీడ్ రోల్ పోషిస్తోంది.