Begin typing your search above and press return to search.

ప‌టానీ బ్యూటీ ఏం ఎత్తుతుందండి!

ఫిట్ నెస్ విష‌యంలో హీరోయిన్లు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు? అన్న‌ది చెప్పాల్సిన పనిలేదు. నిత్యం యోగా.. జిమ్ అంటూ త‌ప్ప‌కుండా కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తారు

By:  Tupaki Desk   |   6 Dec 2023 1:30 AM GMT
ప‌టానీ బ్యూటీ ఏం ఎత్తుతుందండి!
X

ఫిట్ నెస్ విష‌యంలో హీరోయిన్లు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు? అన్న‌ది చెప్పాల్సిన పనిలేదు. నిత్యం యోగా.. జిమ్ అంటూ త‌ప్ప‌కుండా కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తారు. అందులోనూ బాలీవుడ్ హీరోయిన్లు మిగ‌తా భాష‌ల భామ‌లంద‌రికీ కంటే మ‌రింత స్ట్రిక్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. సీనియ‌ర్ నాయిక‌ల్లో మ‌లైకా అరోరా.. క‌రీనా క‌పూర్ లాంటి వాళ్లని మంచి ఫిట్ నెస్ ప్రీక్ లుగా చెప్పొచ్చు. ఇక ఆ త‌ర్వాత త‌రం హీరోయిన్లు అంతా దాదాపు సీనియ‌ర్ల‌ను మంచి ఫిట్ నెస్ ప్రియులు అనొచ్చు.


అందులోనూ దిశా ప‌టానీ అయితే ఫిట్ నెస్ లో మాస్ట‌ర్స్ కూడా పూర్తిచేసింద‌నొచ్చు. న‌వ‌త‌రం నాయిక‌ల్లో ఫిట్ నెస్ విష‌యంలో ప‌టానీ బ్యూటీ ఎప్పుడూ సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంటుంది. ఎప్ప‌టి క‌ప్పుడు ఫిట్ నెస్ వీడియోలు...ఫోటోలు షేర్ చేసి స్పూర్తిని నింపుతుంది. తాజాగా అమ్మ‌డి సిరీస్ నుంచి మ‌రో వీడియో రిలీజ్ చేసింది. ఇందులో దిశా ప‌టానీ 25-30 కేజీల బ‌రువుల్ని సునాయాసంగా గెండె స‌మాన‌మైన‌ ఎత్తుకు ఎత్తేసి షాక్ ఇచ్చింది.

హెవీ వెయిట్స్ తో పొట్ట‌ని త‌గ్గించే వ్యాయామాలు ఇవ‌న్నీ. ఇవి ఎంతో క‌ఠిన‌మైన వ్యాయామం. ట్రెయిన‌ర్ స‌మ‌క్షంలో అమ్మ‌డు ఇలా క‌ఠోరంగా శ్ర‌మిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. దిశా ప‌టానీ శ్ర‌మ‌ని చూసి వావ్ అన‌కుండా ఉండ లేక‌పోతున్నారు. ఇక బ్యూటీ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ లో దూసుకుపోతుంది. దిశ‌లో యాక్టింగ్ ట్యాలెంట్ మెచ్చి యంగ్ మేక‌ర్ నాగ అశ్విన్ అవ‌కాశం క‌ల్కీలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో ఎలాంటి పుర్పార్మెన్స్ తో మెప్పిస్తుందో చూడాలి.

అలాగే తెలుగు లో మ‌రిన్ని ఛాన్సులు ఒడిసిప‌ట్టుకుంటుంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వస్తున్నాయి. కోలీవుడ్ లో సూర్య స‌ర‌స‌న ఓ సినిమా చేస్తుంది. ఏకంగా పిరియాడిక్ చిత్రంలోనే అవ‌కాశం అందుకో వ‌డంతో అక్క‌డా దిశా హాట్ టాపిక్ గానే మారింది. ఆ సినిమా స‌క్సెస్ తో మ‌రిన్ని అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం ఖాయం.