Begin typing your search above and press return to search.

టాప్ హీరోయిన్‌ మేకప్‌ లేకుండా వైట్ చీరలో వచ్చింది

సౌత్ హీరోలు ఉత్తర భారతంలో సక్సెస్ అవుతున్నారు కానీ, సౌత్‌ దర్శకులు బాలీవుడ్ లో సక్సెస్ ను దక్కించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:30 PM GMT
టాప్ హీరోయిన్‌ మేకప్‌ లేకుండా వైట్ చీరలో వచ్చింది
X

సౌత్ హీరోలు ఉత్తర భారతంలో సక్సెస్ అవుతున్నారు కానీ, సౌత్‌ దర్శకులు బాలీవుడ్ లో సక్సెస్ ను దక్కించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో తమిళ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. వెయ్యి కోట్ల మూవీని హిందీ సినీ ఇండస్ట్రీకి అందించి పాన్ ఇండియా స్టార్‌ దర్శకుల జాబితాలో నిలిచాడు.

బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాను రూపొందించిన దర్శకుడు అట్లీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయనతో సినిమాలకు ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్స్ క్యూ కడుతున్నారు అనడంలో సందేహం లేదు. జవాన్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని దక్కించుకున్న నేపథ్యం లో అట్లీ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

తాజాగా అట్లీ ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్ మొదటి రోజు దీపికా పదుకొణె గారు ఎలాంటి మేకప్ లేకుండా తెల్ల చీరలో సెట్స్ కు వచ్చారు. సెట్స్ కు వచ్చే సమయంలో కూడా చాలా మంది మేకప్‌ తో వస్తారు. కానీ దీపికా మాత్రం మేకప్ లేకుండా రావడం తో నేను షాక్ అయ్యాను.

ఇప్పటి వరకు నేను పలువురు హీరోయిన్స్ తో వర్క్ చేశాను. అందులో ఏ ఒక్కరు కూడా సెట్స్ కి మేకప్‌ లేకుండా రాలేదు. మేకప్‌ తోనే ప్రతి ఒక్కరు కనిపించారు. కానీ దీపికా మాత్రం మేకప్‌ లేకుండా సెట్స్ రావడంతో నేను నిజంగా సర్‌ ప్రైజ్ అయ్యాను. ఆమె ఈ సినిమాలో ఉండటం వల్ల సినిమా స్థాయి మరింత పెరిగిందని, ఈ సినిమాలో నటించినందుకు ఆమెకు కృతజ్ఞతలు అంటూ అట్లీ పేర్కొన్నాడు.

షారుఖ్ ఖాన్ తో అట్లీ రూపొందించిన జవాన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నయనతార కనిపించింది. అయితే ఆమె ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వదు. కనుక ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు కూడా హాజరు అవ్వలేదు. దాంతో జవాన్‌ ప్రమోషన్‌ బాధ్యతను దీపికా పదుకొనె తన భుజాలపై వేసుకుంది.