Begin typing your search above and press return to search.

సౌందర్య, ప్రత్యూష, దివ్య భారతి, పూనమ్ పాండే...

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా ద్వారా సందడి చేసి హఠాత్తుగా మృతి చెందిన పూనమ్ పాండే మృతిని ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:38 AM GMT
సౌందర్య, ప్రత్యూష, దివ్య భారతి, పూనమ్ పాండే...
X

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సౌత్ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన పూనమ్ పాండే మృతి చాలా మందికి షాకింగ్ గా చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా ద్వారా సందడి చేసి హఠాత్తుగా మృతి చెందిన పూనమ్ పాండే మృతిని ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మరణ వార్త నెటిజన్స్‌ కి షాక్‌ ఇచ్చింది.

32 ఏళ్ల వయసుకే నిండు నూరేళ్లు నిండిన పూనమ్‌ పాండే ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. హీరోయిన్‌ గా పెద్దగా గుర్తింపు రాకున్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు, ఎన్నో రకాలుగా ఆమె వార్తల్లో నిలిచేది.

పూనం పాండే మాదిరిగా చాలా చిన్న వయసులో మృతి చెందిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా చిన్న వయసులో మృతి చెందిన వారు పలువురు ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికి గుర్తుంచుకునే హీరోయిన్‌ సౌందర్య. ఆమె 32 ఏళ్ల వయసులో మృతి చెందిన విషయం తెల్సిందే.

ఇక చిన్న వయసులోనే స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న దివ్య భారతి కేవలం 19 ఏళ్ల వయసులో మృతి చెందింది. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుని కొన్నాళ్లు టాప్ హీరోయిన్ గా నిలిచిన ఆర్తి అగర్వాల్‌ కూడా కేవలం 31 ఏళ్ల వయసులోనే మృతి చెందినది.

ఇంకా తెలుగు హీరోయిన్ ప్రత్యుష 20 ఏళ్ల వయసులో, భార్గవి 23 ఏళ్ల వయసులో, సిల్క్‌ స్మిత 35 ఏళ్ల వయసులో జయలక్ష్మి అలియాస్ సుప్రిత 22 ఏళ్ల వయసులో, జియా ఖాన్‌ 25 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఈ హీరోయిన్స్‌ చిన్న వయసులో మృతి చెందినా కూడా ఎప్పటికి వారి అభిమానుల మనసులో స్థానం కలిగి ఉంటారు.