Begin typing your search above and press return to search.

హుషారు బ్యూటీ అందాల షో అదుర్స్‌

కన్నడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ దక్ష నాగర్కర్‌

By:  Tupaki Desk   |   3 March 2024 1:30 PM GMT
హుషారు బ్యూటీ అందాల షో అదుర్స్‌
X

కన్నడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ దక్ష నాగర్కర్‌. ఈ అమ్మడు తెలుగు లో ఏకే రావు పీకే రావు అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన కూడా హుషారు సినిమాలో నటించి మరోసారి తన అదృష్టం ను పరీక్షించుకుంది.

ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అవ్వడంతో పాటు మంచి నటన స్కిల్స్ ఉన్న ముద్దుగుమ్మ ఈ అమ్మడు అని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. ఆ మధ్య నాగ చైతన్య తో ఒక వీడియో వల్ల సోషల్‌ మీడియా తెగ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెల్సిందే.

ఈ అమ్మడు జాంబీ రెడ్డి తో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. సినిమాల్లో ఆఫర్లు ఆశించిన స్థాయిలో రాకున్నా కూడా ఇలా సోషల్‌ మీడియాలో అందాల షో చేస్తూ అదుర్స్ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి కవ్వించే ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

అందమైన దక్ష సెల్ఫీ పిక్స్ తో పాటు సింపుల్‌ అండ్ స్వీట్ అనిపించేంత అందంగా ఈ ఫోటోల్లో ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉన్నా కూడా దక్ష కి అదృష్టం కలిసి రాకపోవడం వల్లే ఇండస్ట్రీ లో బిజీ అవ్వలేక పోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.