Begin typing your search above and press return to search.

SSMB 29 బ్యూటీ.. అల్ట్రా గ్లామరస్ బాసూ!

ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   13 March 2024 6:04 PM GMT
SSMB 29 బ్యూటీ.. అల్ట్రా గ్లామరస్ బాసూ!
X

ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారాయన. 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో తొలిసారి తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. ఇప్పుడు తన తదుపరి మూవీని ఆర్ఆర్ఆర్ కన్నా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తన కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు విదేశీ టెక్నీషియన్స్ తో చర్చించి అగ్రిమెంట్లు కూడా జక్కన్న చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫారిన్ యాక్టర్లను కూడా ఇండియా రప్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఎవరు హీరోయిన్ గా నటించనున్నారోనని సినీ ప్రియుల్లో చాలా క్యూరియాసిటీ ఉంది.

ఇక SSMB 29 మూవీకి హీరోయిన్ గా ఇండోనేషియాకు చెందిన బ్యూటీని రాజమౌళిని సెలెక్ట్ చేసినట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. చెల్సియా ఇస్లెన్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ స్క్రీన్ టెస్ట్, లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. దీంతో ఈ ఇండోనేషియా అమ్మడు కోసం సినీ లోకం ఎదురుచూస్తోంది.

అయితే హీరోయిన్ గా చెల్సియా ఇస్లెన్.. ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చిన తర్వాత నుంచి ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె పోస్ట్ చేసిన వెంటనే.. వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఆమె కొత్త ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో వైట్ కలర్ కోట్ వేసుకున్న అమ్మడు.. చాలా అందంగా కనిపిస్తోంది. డైమండ్ ఇయర్ స్టడ్స్ పెట్టుకుని గ్లామర్ లుక్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్.. వెల్ కమ్ టు టాలీవుడ్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఇస్లెన్.. టీవీ సిరీస్ తాయెంగా మేసా గిట్టు ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ సీరియల్ లో తన యాక్టింగ్ కు గాను ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఇండోనేషియాతోపాటు కొన్ని దేశాల్లో కూడా ఫ్యాన్స్ సంపాదించుకుంది. మరి ఇస్లెన్ జక్కన్న- మహేష్ పాన్ ఇండియా మూవీతో ఎలా అలరిస్తుందో చూడాలి.