Begin typing your search above and press return to search.

బ్లాక్ గౌన్ లో చాందిని.. హీటెక్కిస్తోందిగా..

చాందినీ చౌదరి.. అచ్చమైన తెలుగు అందం ఈ బ్యూటీ సొంతం. చాలా సింపుల్ గా కనిపిస్తూనే అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంటుంది

By:  Tupaki Desk   |   12 March 2024 12:10 PM GMT
బ్లాక్ గౌన్ లో చాందిని.. హీటెక్కిస్తోందిగా..
X

చాందినీ చౌదరి.. అచ్చమైన తెలుగు అందం ఈ బ్యూటీ సొంతం. చాలా సింపుల్ గా కనిపిస్తూనే అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హోమ్లీ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ గ్లామర్ తో షాక్ అయ్యేలా చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారు మతులు పోగుడుతుంటోంది.

సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కెరీర్ తో పాటు పర్సనల్ అప్డేట్స్ తో తన ఫ్యాన్స్ ను పలకరిస్తుంటోంది. ట్రెడిషనల్ తో పాటు ట్రెండీ ఔట్ ఫిట్స్ లో ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తుంటోంది. పొట్టి డ్రెస్సుల్లోనే కాకుండా శారీల్లోనూ హోయలు ఒలకిస్తుంటోంది. తన గ్లామర్ షోతో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. నడుము అందాలు చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటోంది.

తాజాగా ఈ బ్యూటీ.. స్టన్నింగ్ పిక్ ను షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో కిర్రాక్ పోజు ఇచ్చింది. డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ తో ఓరగా చూస్తూ ఆకట్టుకుంటోంది. ఎటైర్ సింపుల్ గా ఉన్నా.. చూపు తిప్పుకోనివ్వడం లేదు ఈ అమ్మడు. వాచింగ్ యూ వాచింగ్ మీ అంటూ ఫైర్ ఇమోజీలు క్యాప్షన్ గా ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పిక్ కు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

కేటుగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది చాందినీ చౌదరి. ఆ తర్వాత కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి, మను, కలర్ ఫొటో, బొంభాట్, సూపర్ ఓవర్, సమ్మతమే సినిమాల్లో నటించి తెలుగు సినీ ప్రియుల గుండెల్లో నిలిచిపోయింది. ఇక 2013లో మధురం షార్ట్ ఫిల్మ్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.

ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న విశ్వక్ సేన్ గామి చిత్రంలో యాక్ట్ చేసింది చాందిని. డాక్టర్ జాహ్నవి రోల్ లో విశ్వక్ తో సమానంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో తొమ్మిదేళ్ల తర్వాత థియేటర్ సక్సెస్ పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. బాలకృష్ణ- బాబీ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమాతో చాందిని ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.