Begin typing your search above and press return to search.

రిలీజ్ కాకముందే రఫ్ఫాడించేస్తున్న అమ్మడు..!

టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటూనే వస్తుంది. ఇలా వచ్చి అలా వెళ్లే హీరోయిన్స్ కొందరైతే స్టార్ క్రేజ్ తెచ్చుకుని అదరగొట్టేవారు కొందరు

By:  Tupaki Desk   |   12 April 2024 5:18 AM GMT
రిలీజ్ కాకముందే రఫ్ఫాడించేస్తున్న అమ్మడు..!
X

టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటూనే వస్తుంది. ఇలా వచ్చి అలా వెళ్లే హీరోయిన్స్ కొందరైతే స్టార్ క్రేజ్ తెచ్చుకుని అదరగొట్టేవారు కొందరు. అయితే స్టార్ హీరోయిన్స్ ని కూడా రిపీట్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపించరు. అందుకే ఆడియన్స్ కు కొత్త అందాలను పరిచయం చేయాలని చూస్తారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎవరు స్టార్ అవుతారు ఎవరు వెనకబడతారు అన్నది చెప్పడం కష్టం. అయితే సెట్స్ మీద ఉండగానే వరుస ఛాన్సులు అందుకునే భామలు తక్కువ మంది ఉన్నారు.

తెలుగులో స్టార్ హీరోయిన్స్ దూకుడు తగ్గించగా యువ హీరోయిన్ల హడావిడి ఎక్కువైంది. ముఖ్యంగా కొత్త భామలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వారిలో మాస్ మహరాజ్ రవితేజతో నటిస్తున్న భాగ్య శ్రీకి మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ యారియాన్ 2 సినిమాలో నటించిన భాగ్యశ్రీ బోర్స్ హరీష్ శంకర్ దృష్టిలో పడింది. కొత్త హీరోయిన్స్ కు ఛాన్స్ ఇచ్చే రవితేజ సినిమాలో భాగ్యశ్రీ ని ఎంపిక చేశారు.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే భాగ్య శ్రీకి వరుస ఛాన్సులు వస్తున్నాయి. లేటెస్ట్ గా నాని సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీని అడిగినట్టు టాక్. డివివి దానయ్య బ్యానర్ లో నాని హీరోగా చేస్తున్న సినిమాను సుజిత్ డైరెక్ట్ చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న సుజిత్ ఆ సినిమా పూర్తి కాగానే నాని సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

నాని 31వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లో భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఒక్క రిలీజ్ అవ్వకుండానే భాగ్య శ్రీకి వరుస అవకాశాలు వస్తుండటం ఆమె టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ప్రతిభ గల ఎవరినైనా సరే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అదీగాక రవితేజ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అంటే లక్కీ ఆఫర్ అన్నట్టే లెక్క. ఆల్రెడీ ధమాకాతో శ్రీలీల టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాగా మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ కూడా అదే రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి. నాని సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్స్ కు మంచి బూస్టింగ్ అన్నట్టే అవుతుంది. మరి నానితో భాగ్య శ్రీ జతకడుతున్న ఈ సినిమా ఆమె కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి.