Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్టార్‌ క్రికెటర్‌ శ్రీమతి మతి పోగొట్టే హాట్‌ ఫోజ్‌

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:39 AM GMT
పిక్ టాక్ : స్టార్‌ క్రికెటర్‌ శ్రీమతి మతి పోగొట్టే హాట్‌ ఫోజ్‌
X

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలతో కంటే కూడా ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారా మరియు క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ తో ప్రేమాయణం వల్ల వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఈమె మరోసారి సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది.


కేఎల్‌ రాహుల్ తో వివాహం తర్వాత అతియా శెట్టి స్కిన్‌ షో తగ్గించింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం నిజం కాదని, ఆమె మునుపటి మాదిరిగానే చాలా అందంగా సెక్సీగా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తూ ఉంటే అనిపిస్తోందని నెటిజన్స్ మరియు సోషల్ మీడియాలో ఆమె ని ఫాలో అయ్యే వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


హీరో సినిమా తో ఇండస్ట్రీ లో 2015 లో ఎంట్రీ ఇచ్చిన అతియా ఆ తర్వాత ముబారకన్ లో కీలక పాత్ర పోషించింది. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దానికి తోడు ఇటీవలే క్రికెటర్ రాహుల్‌ ను వివాహం చేసుకోవడం తో ఈ అమ్మడు సినిమాలకు దూరం అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.


గత నాలుగు సంవత్సరాలుగా అతియా శెట్టి సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఈ రేంజ్ లో అందంగా సెక్సీగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ను నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు ఇంకా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.

చాలా మంది క్రికెటర్స్ భార్య లో ఇండస్ట్రీ లో ఉన్నారు. కనుక అతియా మళ్లీ సినిమాల్లో నటించడంలో తప్పేంటి అంటూ కొందరు ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. మరి స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ మద్దతుతో అతియా శెట్టి రీ ఎంట్రీ ఇచ్చేనా చూడాలి.