Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అసిన్ కూతురు బార్బీ

గ‌జిని-ఘ‌ర్ష‌ణ స‌హా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన అశిన్ టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర‌హీరోయిన్ గా ఏలింది

By:  Tupaki Desk   |   12 Nov 2023 3:00 AM GMT
ఫోటో స్టోరి: అసిన్ కూతురు బార్బీ
X

గ‌జిని-ఘ‌ర్ష‌ణ స‌హా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన అసిన్ టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర‌హీరోయిన్ గా ఏలింది. అటుపై బాలీవుడ్ లోను ఈ భామ అడుగుపెట్టింది. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్, అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది. అక్ష‌య్ తో న‌టించే క్ర‌మంలోనే అశిన్ కి అక్ష‌య్ స్నేహితుడు రాహుల్ శ‌ర్మ‌తో ప‌రిచ‌య‌మైంది. ఆ ఇద్ద‌రి న‌డుమా సుదీర్ఘ‌ ప్రేమాయ‌ణం కొన‌సాగింది. అటుపై అత‌డిని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. త‌న‌కు 6 ఏళ్ల ఆరిన్ అనే చిన్నారి పాప ఉంది.


అసిన్ ఇటీవల తన కుమార్తె 6వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. పింక్- పర్పుల్ బెలూన్‌లు, ప్రిన్సెస్ ప్రాప్‌లు, సీతాకోకచిలుకలు, కోట ఆకారంలో ఉన్న కేక్ వంటి వాటిని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. వాటితో పాటు త‌న కుమార్తె అరిన్ ఫోటోని కూడా షేర్ చేసింది. 'ప్రిన్సెస్ అరిన్ 6వ పుట్టినరోజు పార్టీ' అని అసిన్ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్ లో అరిన్ అచ్చం బార్బీలా ఉంది. ఎంతో క్యూట్ గా జూనియ‌ర్ అశిన్ నే త‌ల‌పించింది. అసిన్ గత కొన్నేళ్లుగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంది. కానీ త‌న‌ సోషల్ మీడియాలో ఫోటోలు - వీడియోలతో తన అభిమానులను ట్రీట్ చేస్తూనే ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమార్తె పుట్టినరోజు వేడుక‌ల ఫోటోల‌ను షేర్ చేసిన అశిన్ ఇలా రాసింది. "మా చిన్న యువరాణికి 6 సంవత్సరాలు వచ్చాయి.. ఇంకా ఎందులోను తక్కువ కాదు! పుస్తకాలపై ప్రేమ ఉన్న అమ్మాయి.. డ్యాన్స్ పార్టీలపై సిండ్రెల్లా ప్రేమ, అరోరా, ఏరియల్‌లను మించిన ఉత్సుకత, మెరిడా- జాస్మిన్‌లను ట్రంప్ చేసే దృఢ సంకల్పం.. మెరిసే స్ఫూర్తితో చాలా విశిష్టంగా, స్పష్టంగా, ARIN, ధన్యవాదాలు మీరు మా జీవితాలను మాయాజాలంగా మార్చినందుకు మీ కలలన్నీ నిజమవుతాయి. #పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రిన్సెస్ ఆరిన్ #అరిన్ రేన్'' అంటూ అశిన్ పోయెటిక్ గా విషెస్ తెలిపింది. అశిన్ కుమార్తె ఎంతో క్యూట్ గా క‌నిపిస్తోంది. త‌న రూపం కూడా త‌న త‌ల్లినే పోలి ఉండ‌డంతో జూనియ‌ర్ అసిన్ అని కూడా అభిమానులు పిలుచుకుంటున్నారు.