Begin typing your search above and press return to search.

ప‌చ్చ కోక నారింజ‌ ర‌వికెలో కిల్ల‌ర్ బ్యూటీ భంగిమ‌లు

త‌న‌దైన అందం క్యూట్ నెస్ తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించే బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:55 AM GMT
ప‌చ్చ కోక నారింజ‌ ర‌వికెలో కిల్ల‌ర్ బ్యూటీ భంగిమ‌లు
X

త‌న‌దైన అందం క్యూట్ నెస్ తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించే బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ప్రేమ‌మ్ సినిమాతో కెరీర్ ప్రారంభించి ద‌శాబ్ధం పాటు కెరీర్ బండిని సునాయాసంగా లాగించేసిన ఈ బ్యూటీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ స్టార్ డ‌మ్ అందుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇక అనుప‌మకు సోష‌ల్ మీడియాల్లోను అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది.


ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం వేడెక్కించే పోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న అనుప‌మ ఇప్పుడు మ‌రోసారి హాట్ ఫోటోషూట్ తో విరుచుకుప‌డింది. తాజా ఫోటోషూట్ లో క‌ళాత్మ‌క‌త జోడించిన శారీ లుక్ తో హాట్ అప్పియ‌రెన్స్ మైమ‌రిపిస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో క్యూటీ మునుప‌టి కంటే టూ హాట్ గా క‌నిపిస్తోంది.


అనుపమ పరమేశ్వరన్ ఆరు గజాల చీర‌లో దేశీ గర్ల్ వైబ్స్ ను వెదజల్లింది. ప‌చ్చ కోక - ఎర్ర ర‌వికెలో కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తోంది అనుప‌మ‌. ఇక ఈ క్యూటీ భంగిమ‌ల‌ను చూస్తే విర‌హాగ్నితో జ్వ‌లిస్తోంది! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తనదైన‌ స్టైల్ యాటిట్యూడ్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న సౌత్ బ్యూటీ ఇప్పుడు దేశీ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది.


అనుప‌మ రివీలింగ్ చీర‌లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. నిజానికి అనుప‌మ పార్టీలకు ప్రాధాన్య‌త‌నిచ్చే టామ్ బోయిష్ గాళ్ కాదు! రొటీన్ కి భిన్న‌మైన అమ్మాయి.. త‌న అందంతో క‌వ్విస్తూ యూత్ మ‌న‌సులు దోచేస్తుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.