Begin typing your search above and press return to search.

గ్లామర్ డోస్ తోనే ఛాన్సులు కొట్టేస్తోంది!

రకరకాల ఢిపరెంట్ ఔట్ ఫిట్లలో ఫొటోషూట్ చేస్తుంటుంది. హాట్ హాట్ గా పోజులిస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది

By:  Tupaki Desk   |   14 Sep 2023 3:30 PM GMT
గ్లామర్ డోస్ తోనే ఛాన్సులు కొట్టేస్తోంది!
X

ఇప్పటికే ఎంతోమంది ఇతర రాష్ట్రాల ముద్దుగుమ్మలు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. వారిలో.. విశ్వాసం, ఎంతవాడుగానీ సినిమాల్లో అజిత్‌ కూతురిగా నటించిన అనిఖా సురేంద్రన్‌ ఒకరు. మలయాళంతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనూ బాగా పాపులర్ అయింది. నాగార్జున ఘోస్ట్ లోనూ ఒక పాత్రలో మెరిసిన ఈ పాప.. బుట్టబొమ్మ చిత్రంతో హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తన గ్లామర్ లుక్స్ తో వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది.


వివరాళ్లోకి వెళితే.. తెలుగులో హీరోయిన్ గా అనిఖా సురేంద్రన్ కు బుట్టబొమ్మ సినిమా మొదటిది. ఈ చిత్రంలో తన యాక్టింగ్, గ్లామర్ లుక్స్ తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. యూత్ లో బాగానే ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే యూత్ లో మరింత క్రేజ్ ను పెంచుకునేందుకు ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ పై మరింత ఫోకస్ పెంచింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

రకరకాల ఢిపరెంట్ ఔట్ ఫిట్లలో ఫొటోషూట్ చేస్తుంటుంది. హాట్ హాట్ గా పోజులిస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తన లేలేత అందాలతో కుర్రకారు మనసు దోచేస్తోంది. గ్లామర్ డోస్ పెంచి యూత్ కు పిచ్చెక్కించేస్తోంది. అలాగే వారి హృదయాలను కొల్లగొట్టేస్తోంది. ఆమె ఫొటోస్ చూసిన కుర్రాళ్లు.. మైండ్ బ్లోయింగ్, ఈ అమ్మడిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ హాట్ ఎమోజీలతో కామెంట్లు కూడా పెడుతుంటారు.

ఇప్పుడు ఈ చిన్నది ఇమేజ్ ఎలా పెరుగుతుందంటే.. ఇతర యంగ్ హీరోయిన్ల అందాల్ని, వాళ్ల ఇమేజ్ ను తలదన్నేలా కనిపిస్తోంది. అలాగే ఇప్పుడీ ముద్దుగుమ్మకు సినిమాల్లో మంచి ఛాన్స్ లు కూడా వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుశ 50వ పాన్ ఇండియా చిత్రంలోనూ అవకాశం అందుకుంది. ఇంకా ఈ అమ్మడు చేతిలో ఓ మలయాళ సినిమా మరో నాలుగు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాల్లో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుండగా.. మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలు కనుక మంచి విజయం సాధిస్తే అనిఖాకు భవిష్యత్ లో మరిన్ని సూపర్ ఆఫర్స్ రావడం ఖాయమే.. ఫైనల్ గా అనిఖా.. తన యాక్టింగ్, బోల్డ్ గ్లామర్ తో మంచి అవకాశాలనే పట్టేస్తుందని నెటిజన్లు అంటున్నారు.