Begin typing your search above and press return to search.

చీరలో అనన్య.. ఆ 'జాకెట్' స్టైల్ కి పడిపోతారు!

అనన్యా పాండే సినిమాలు తక్కువగాగా చేసిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది

By:  Tupaki Desk   |   14 Aug 2023 3:58 AM GMT
చీరలో అనన్య.. ఆ జాకెట్ స్టైల్ కి పడిపోతారు!
X

బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతున్న అందాల భామ అనన్యా పాండే. తండ్రి చుంకీ పాండే వారసత్వంతో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడానికి ఈ బ్యూటీకి చాలా ఈజీగా అవకాశం దొరికింది. 2019లో కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.


ఆ మూవీ హిట్ కావడంతో తరువాత వరుస అవకాశాలు వచ్చాయి. లైగర్ మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. నిజానికి లైగర్ తెలుగు సినిమా అనేకంటే హిందీలో చేసి తెలుగులో డబ్ చేసిన మూవీ అంటే సరిపోతుంది. అయితే ఈ చిత్రం అనన్యా పాండేకి ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం అనన్యా పాండే చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.


ఇందులో రెండు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా ఇంకోటి కంప్లీట్ అయ్యి రిలీజ్ కి సిద్ధమవుతోంది. డ్రీమ్ గర్ల్ 2లో అనన్యా పాండే మెయిన్ లీడ్ చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఆగష్టు 25న ఈ చిత్రం రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.

అనన్యా పాండే సినిమాలు తక్కువగాగా చేసిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ టెంప్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ బ్యూటీని ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 25.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫోటోలు షేర్ చేస్తే లక్షల్లో లైక్ చేస్తూ ఉంటారు.


తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం అప్పుడప్పుడు అనన్యా పాండే హాట్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో అందాల ప్రదర్శన చేస్తూ కేక పుట్టిస్తోంది. సిల్క్ శారీలో శృంగార దేవతలా అనన్యా ముగ్ధమనోహర రూప లావణ్యం మైమరిపిస్తోంది. ఈ ఫోటోలకి ఏకంగా 2.50 లక్షల మంది లైక్ చేయడం విశేషం.