Begin typing your search above and press return to search.

అన‌న్య‌.. వ్వావ్ క‌ళ్లు తిప్పుకుంటే ఒట్టు

అందానికి అందం ప్ర‌తిభ‌, వీట‌న్నిటికీ మించి అదృష్టం క‌లిసొచ్చిన భామ అన‌న్య పాండే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా క‌థానాయిక‌గా కెరీర్ బండిని స‌జావుగా లాగించేస్తోంది

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:44 PM GMT
అన‌న్య‌.. వ్వావ్ క‌ళ్లు తిప్పుకుంటే ఒట్టు
X

అందానికి అందం ప్ర‌తిభ‌, వీట‌న్నిటికీ మించి అదృష్టం క‌లిసొచ్చిన భామ అన‌న్య పాండే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా క‌థానాయిక‌గా కెరీర్ బండిని స‌జావుగా లాగించేస్తోంది. వ‌రుస‌గా యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ అన‌న్య స‌త్తా చాటుతోంది. ఇటీవ‌ల ఆదిత్యారాయ్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం సాగిస్తూ నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 8లో మ‌రోసారి ఆదిత్యారాయ్ తో ప్రేమాయ‌ణం గురించి ఈ బ్యూటీ ఓపెనైంది. ఇటీవ‌ల అనన్య సోష‌ల్ మీడియాల్లో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయిపోతోంది. వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతూ యువ‌త‌రానికి కంటిమీద కునుకుప‌ట్ట‌నీకుండా చేస్తోంది.


ఇంత‌కుముందు బాలీవుడ్ టాప్ సెల‌బ్స్ దీపావ‌ళి పార్టీల్లో కిల్లింగ్ లుక్ తో క‌ట్టి ప‌డేసిన అన‌న్య పాండే ఇప్పుడు మ‌రోసారి డైమండ్ మెరుపుల‌తో కిల్ చేసింది. తాజాగా క్రిస్ట‌లైన్ డిజైన‌ర్ లెహంగాను ధ‌రించి వ్వావ్ అనిపించింది. మంచి ముత్యాలు, ర‌క‌ర‌కాల క్రిస్ట‌ల్స్ అల్లిక‌లు ఎంబ్రాయిడ‌రీతో రూపొందించిన ఈ డ్రెస్ లో అనన్య ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. దీనికి మించి దీపావ‌ళి ట్రెడిష‌న్ కి త‌గ్గ‌ట్టు సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తోంది. ఇక అందంగా క‌నిపిస్తూనే హాట్ నెస్ ని ఎలివేట్ చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అని కూడా అన‌న్య పాండే నిరూపిస్తోంది. తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


దీపావ‌ళి ముందే కొత్త ఇంట్లోకి:

అనన్య పాండే ధన్‌తేరాస్ 2023 సందర్భంగా కొత్త ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా జ‌రిపిన పూజా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. అన‌న్య ఒక్కో సినిమాకి 4-6 కోట్ల మ‌ధ్య అందుకుంటోంది. త‌న పారితోషికాల‌ను రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులుగా పెడుతోంది. ఇప్పుడు ఇలా త‌న సాముపార్జ‌న‌తో ఇల్లు కూడా కొనుక్కుని చంకీ పాండేకి గ‌ర్వించ‌ద‌గిన కూతురు అయింది.

అనన్య చంకీ పాండే -భావన పాండేల కుమార్తె అన్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనన్య చివరిసారిగా డ్రీమ్ గర్ల్ 2లో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. తర్వాత సిద్ధాంత్ చతుర్వేది- ఆదర్శ్ గౌరవ్‌లతో కలిసి 'ఖో గయే హమ్ కహాన్‌'లో కనిపించనుంది. 'కాల్ మీ బే' అనే వెబ్ సిరీస్ లోను న‌టించనుంది. త‌దుప‌రి మరో రెండు సినిమాలకు సంత‌కాలు చేసింది. వాటి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.