Begin typing your search above and press return to search.

47లో బద్రి హీరోయిన్ కు బిగ్ హిట్

By:  Tupaki Desk   |   13 Aug 2023 5:27 AM GMT
47లో బద్రి హీరోయిన్ కు బిగ్ హిట్
X

పవన్ కళ్యాణ్ భద్రి సినిమాలో హీరోయిన్ గా చేసిన అమీషా పటేల్ ని అంత ఈజీగా ఎవరూ మరిచిపోరు. ఆమె కెరియర్ ఆరంభంలో భద్రి సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. తరువాత హిందీలో గద్దర్ మూవీతో హిట్ పడటంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయి అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ఏకంగా దశాబ్ద కాలం స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో చక్రం తిప్పింది.

తెలుగులో కూడా మధ్యలో మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్ తో నారసింహుడు సినిమాలలో నటించింది. ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా తన ప్రస్తానం కొనసాగిస్తోన్న ఈ అందాల భామ లేటు వయస్సులో ఇన్ స్టాగ్రామ్ లో హాట్ బాంబ్ గా మారిపోయింది. కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా తనని తాను షోకేస్ చేసుకుంటోంది.

47 ఏళ్ళ వయస్సులో వన్నె తగ్గని అందాలతో అమీషా పటేల్ చేసే గ్లామర్ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇంత వయస్సు వచ్చిన ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. నటిగానే కెరియర్ ని మరింత బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. తాజాగా గద్దర్ కి సీక్వెల్ గా వచ్చిన గద్దర్ 2తో ఆమె మళ్ళీ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో సన్నీడియోల్ హీరో. 2001లో లవ్ అండ్ యాక్షన్ మూవీగా గద్దర్ వచ్చింది.

దానికి సీక్వెల్ గానే గద్దర్ 2 తాజాగా రిలీజ్ అయ్యింది. మొదటి సినిమా హిట్ కారణంగా సీక్వెల్ పైన మంచి హైప్ ఉంది. దీంతో అవుట్ డేటెడ్ యాక్టర్స్ అయిన కూడా మొదటి రోజు ఈ చిత్రం ఏకంగా 40 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా కథ, కథనం కూడా రొటీన్ స్టైల్ లో ఉందనే మాట వినిపిస్తోంది. వీకెండ్ మూడు రోజులు ఈ చిత్రానికి కొంత వరకు ఆదరణ వస్తుందని భావిస్తున్నారు.

ఈ మూవీ హిట్ అయితే మాత్రం అమీషా పటేల్ కి మళ్ళీ నటిగా అవకాశాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. హీరోయిన్ గా కాకపోయిన మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరుకుతాయి. మరి అమీషా పటేల్ కి గద్దర్ 2 ఏ విధంగా ఉపయోగపడుతుందనేది చూడాలి.