Begin typing your search above and press return to search.

రెండో పెళ్లికి రెడీ అవుతోన్న అమలాపాల్

ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తరువాత టాలీవుడ్ కి దూరమైంది. తమిళంలో రఘువరన్ బీటెక్ మూవీ సినిమాలో నటించింది

By:  Tupaki Desk   |   26 Oct 2023 10:35 AM GMT
రెండో పెళ్లికి రెడీ అవుతోన్న అమలాపాల్
X

సౌత్ ఇండియాలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అమలాపాల్. మైనా సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి చిత్రంతోనే హిట్ కొట్టింది. తరువాత వరుస అవకాశాలతో స్టార్ యాక్టర్ గా దూసుకుపోయింది. తెలుగులో కూడా ఇద్దరమ్మాయిలతో, నాయక్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తరువాత టాలీవుడ్ కి దూరమైంది. తమిళంలో రఘువరన్ బీటెక్ మూవీ సినిమాలో నటించింది. ఈ మూవీ హిట్ అయ్యింది. అయితే దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తరువాత ఏమైందో పెళ్ళైన మూడేళ్ళకే విడాకులు తీసుకున్నారు.

తరువాత మళ్ళీ నటిగా అమలపాల్ బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. కాని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన పెద్దగా ఫేమ్ లోకి రాలేదు. ఈ మూవీ అయితే ఈ బ్యూటీ సినిమాల ద్వారా కంటే వెకేషన్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా హాట్, బోల్డ్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ ఫోటోలకి మిలియన్స్ లో లైక్స్ వస్తున్నాయి. ఇదిలా ఈ బ్యూటీ రెండో పెళ్లికి సిద్ధమవుతోంది. గోవాలో జగత్ దేశాయ్ అనే తన బాయ్ ఫ్రెండ్ ఈ బ్యూటీకి డాన్స్ చేస్తూ ప్రపోజ్ చేశాడు. అతనికి కిస్ చేస్తూ లవ్ యాక్సప్ట్ చేసింది. దీనికి సంబందించిన వీడియోని జగత్ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

2017లో మొదటి భర్తకి విడాకులు ఇచ్చిన అమలాపాల్ చాలా కాలం తర్వాత సెకండ్ మ్యారేజ్ కి సిద్ధం అవుతూ ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ద్విజ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటుగా కొన్ని వెబ్ సిరీస్ లు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే లవ్ ప్రపోజల్ యాక్సప్ట్ చేసిన పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం వారిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.