Begin typing your search above and press return to search.

బీచ్‌లో బీర్ బాటిల్‌తో దొరికిపోయిన హీరోయిన్

ఇదంతా అమ‌లాపాల్ లోని ఒక కోణం అనుకుంటే.. పెద్ద తెర లేదా ఓటీటీ కోసం రెచ్చిపోయి న‌టించ‌డంలోను ఈ అమ్మ‌డిని కొట్టేవాళ్లే లేరు

By:  Tupaki Desk   |   4 Sep 2023 4:26 AM GMT
బీచ్‌లో బీర్ బాటిల్‌తో దొరికిపోయిన హీరోయిన్
X

బోల్డ్ లుక్స్ తో గుండె జిల్ల‌నిపించ‌డంలో అమలాపాల్ సోష‌ల్ మీడియా స్టింట్ గురించి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డి యాక్టివిటీస్ ప‌రిశీలించిన వారికి అస‌లు సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. ఓవైపు మ‌ల‌యాళీ సాంప్ర‌దాయాల‌ను ఎలివేట్ చేసే క‌ట్టుబొట్టుతో ఆక‌ట్టుకుంటున్న అమలాపాల్, చాలా సంద‌ర్భాల్లో వైవిధ్య‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నేచుర‌ల్ లుక్ పేరుతో స‌హ‌జ‌సిద్ధ‌మైన వ‌స్త్రాల‌ను ఎంపిక చేసుకుని, పాట‌రీ ఉమెన్ లుక్ తో ఇటీవ‌ల ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.


ఇదంతా అమ‌లాపాల్ లోని ఒక కోణం అనుకుంటే.. పెద్ద తెర లేదా ఓటీటీ కోసం రెచ్చిపోయి న‌టించ‌డంలోను ఈ అమ్మ‌డిని కొట్టేవాళ్లే లేరు. బికినీలు, చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో యూత్ టెంప్టింగ్ వ్య‌వ‌హారాల్లో రాటుదేలిన పాల్, ప్ర‌తిసారీ తెర‌ను మ‌రిగించ‌డంలో ఏమాత్రం త‌గ్గ‌దు. మ‌రోవైపు త‌న‌లో బోల్డ్ యాంగిల్ ని దాచేందుకు ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌న‌ని నిరూపిస్తోంది.

ఇప్పుడు బికినీ బీచ్ లో బీర్ బాటిల్ తో అడ్డంగా దొరికిపోయింది ఈ బ్యూటీ. బీచ్ లో ఫ్రెండ్స్ తో క‌లిసి వెకేష‌న్ లో ఉన్న అమ‌లాపాల్ కొన్ని ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది. వీటిలోని ఒక ఫోటో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బీచ్ లో ఫుల్ చిల్లింగ్ మోడ్ లో ఉన్న అమ‌లాపాల్ బీర్ సేవిస్తున్న ఫోటోగ్రాఫ్ బ‌య‌ట‌ప‌డింది. బాటిల్ ఖాళీ చేసి త‌న ముందు ఉన్న బెంచ్ పై ఉంచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇలాంటి ఫోటోని ఆద‌మ‌రిచి షేర్ చేసేసిందా? లేక కావాల‌నే ఇలా టెంప్ట్ చేస్తోందా? అన్న‌ది అర్థంకాలేదు. ఓవైపు వాట‌ర్ మిల‌న్ మ‌రోవైపు బీర్ బాటిల్.. ఇంకోవైపు ఫుడ్ మెనూ ప‌రిశీలిస్తోంది పాల్. ఏది ఏమైనా ఈ ఫోటో విడుద‌లైన క్ష‌ణాల్లో అంత‌ర్జాలాన్ని చుట్టేసింది. ముఖ్యంగా యూత్ వాట్సాపుల్లో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే స‌ర్వైవ‌ల్ డ్రామా ఆడు జీవితంలో న‌టిస్తోంది. ఈ చిత్రం మ‌ల‌యాళం స‌హా ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానుంది. డివిజ‌, యునైటెడ్ బ్యాన‌ర్ నిర్మించే సినిమాలోను అమ‌లాపాల్ న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం ప‌లువురు దర్శ‌కులు వినిపించిన క‌థ‌ల్ని లాక్ చేసింద‌ని స‌మాచారం. పాల్ త‌న‌దైన మార్క్ నాయికా ప్ర‌ధాన చిత్రాల్లోను న‌టించ‌నుంద‌ని స‌మాచారం.