Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరి: స‌ముద్రంలో స్టార్ ఫిష్‌ని త‌ల‌పిస్తోంది

ఆలియా లేటెస్ట్ లుక్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆలియా కిల్లింగ్ లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది

By:  Tupaki Desk   |   3 March 2024 4:44 AM GMT
ఫోటోస్టోరి: స‌ముద్రంలో స్టార్ ఫిష్‌ని త‌ల‌పిస్తోంది
X

ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ని అనుక‌రించ‌డంలో ఆలియా త‌ర్వాతే. ఇటీవ‌ల ఒక బిడ్డ‌కు మామ్ అయిన‌ త‌ర్వాత కూడా త‌గ్గేదేలే! అంటూ పోటీపడుతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆలియా లేటెస్ట్ లుక్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆలియా కిల్లింగ్ లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

ఆలియా ఈ కొత్త ఫోటోషూట్ లో సముద్రంలో స్టార్ ఫిష్‌ని త‌ల‌పిస్తోంది. ఎంపిక చేసుకున్న దుస్తుల డిజైన్ కి బ‌హుశా సీ స్టార్ ఫిష్ స్ఫూర్తి అని భావించాల్సి ఉంటుంది. ఇక నేల‌పై ప‌రుచుకున్న ఈ పొడ‌వాటి గౌన్ ని డిజైన్ చేసిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. డార్క్ నేవీ బ్లూ మ‌ఖ‌మ‌ల్ క్లాథ్ తో రూపొందించిన ఈ డిజైన‌ర్ గౌన్ పై మెరుపుల చ‌మ్కీలు ఎంతో శోభ‌నిస్తుండ‌గా, ఆ థై స్లిట్ ఎలివేష‌న్ ఆలియా ముగ్ధ మ‌నోహ‌ర రూపానికి మ‌రింత‌గా వ‌న్నెలు అద్దింది. ఈ స్పెష‌ల్ గౌన్ లో ఆలియా ఎంతో అబ్బుర‌ప‌రుస్తోంది.

జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో భాగంగా నిన్నటి కాక్‌టెయిల్ ఈవెంట్ నుండి వ‌చ్చిన ఫోటోల్లో ఆలియా ముగ్ధ మ‌నోహ‌ర రూపమిది. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోలు వీడియోలతో ఇంటర్నెట్ హీటెక్కిపోతోంది. ఇదే ఈవెంట్లో కియ‌రా అద్వాణీ, జాన్వీ క‌పూర్, క‌త్రిన కైఫ్, సోన‌మ్ క‌పూర్, క‌రీనా క‌పూర్ ల స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ యువ‌త‌రం హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో మంట‌లు పెడుతున్నాయ్.