Begin typing your search above and press return to search.

ఆలియాకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ? క‌వ‌ర్ ఫోటోపై పంచ్‌లు!

అలియా పేరు ఇటీవ‌ల ప్ర‌ముఖంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇంత‌కుముందు మంచి కార‌ణంతో ఇలా హెడ్ లైన్స్ లోకొచ్చింది

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:28 AM GMT
ఆలియాకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ? క‌వ‌ర్ ఫోటోపై పంచ్‌లు!
X

ఫోటోషాప్ లేదా ఫోటో ఎడిటింగ్ తేడా కొడితే దాని ఫ‌లితం ఎలా ఉంటుందో ఇప్పుడు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు క‌థానాయిక‌ల రూపురేఖ‌ల్ని మార్చేసాయి కొన్ని మ్య‌గ‌జైన్ షూట్లు. ఫోటోషూట్లు ఎంత అందంగా చేసినా వాటిని ఎడిట్ రూమ్ లో ఎడిట్ చేసేప్పుడు చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది. కానీ తేడా చేస్తే అది మార్ఫింగ్ ఫోటో అవుతుంది.


చాలామంది సెల‌బ్రిటీల్లానే ఈసారి ఆలియా భ‌ట్ వంతు. యువ‌త‌రంలో అసాధార‌ణ‌ సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ ని అస్వాధిస్తున్న ఆలియా లుక్ నే ఫోటోషాప్ లో మార్చేయ‌డంతో ఇప్పుడు అంతా షాక్ కి గుర‌య్యారు. త‌న ఫోటోని చూసి క‌నీసం హ‌బ్బీ ర‌ణ‌బీర్ అయినా గుర్తు ప‌డ‌తాడా? అంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయ్. అంత‌గా ఆలియా రూపం మారిపోయింది. ఆమె ఈమేనా? అంటూ చాలా మంది నోరెళ్ల‌బెడుతున్నారు.

అలియా పేరు ఇటీవ‌ల ప్ర‌ముఖంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇంత‌కుముందు మంచి కార‌ణంతో ఇలా హెడ్ లైన్స్ లోకొచ్చింది. గంగూబాయి కతియావాడి చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకోవడం నుండి హార్ట్ ఆఫ్ స్టోన్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం వరకు ప్ర‌తిదీ ఉత్త‌మ‌మైన వార్త‌గా, మీడియా హెడ్ లైన్స్ వ‌చ్చాయి. ఇప్పుడు అలియా భట్ తెల్లటి దుస్తులలో ప్ర‌ఖ్యాత 'వోగ్' కవర్‌ను అలంకరించింది. ఇటీవల వోగ్ మ్యాగజైన్ థాయిలాండ్ ఎడిషన్ కవర్‌పై కనిపించిన అలియా భట్ చిత్రాన్ని రెడ్డిట్ యూజర్ షేర్ చేసి ఘాటైన వ్యాఖ్య‌లు రాశారు. నిజానికి తెల్లటి వర్ణంతో కూడిన షీర్ దుస్తుల్లో ఆలియా చాలా అద్భుతంగా కనిపించింది. అయితే రూపురేఖ‌లే పూర్తిగా మారిపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కవర్ ఫోటోషూట్‌లో అలియా భట్ గుర్తుపట్టలేనంతగా కనిపించడంతో నెటిజన్లు దీనిపై కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. రెడ్డిట్‌లో ఆలియా ఫోటోని షేర్ చేసిన వెంటనే, ఫ్రేమ్‌లో అలియా భట్‌ను గుర్తించడంలో నెటిజన్లు విఫలమయ్యారు. కొంతమంది నెటిజన్లు నటి శ్రద్ధా కపూర్ అని, పరిణీతి చోప్రాలా ఉందని ఎత్తి చూపారు. ''అదే... నేను పరిణీతి అని భావించి లైట్ తీస్కున్నా.. కానీ టైటిల్ చదివి తెలుసుకున్నాను'' అని ఒక‌రు కామెంట్ చేసారు. ''గుర్తించలేక‌పోయాను... ఇది శస్త్రచికిత్స కాదు... ఫోటోషాప్ లేదా మేకప్ తేడా కావచ్చు లేదా కేవలం వ్యక్తీకరణలో తేడా అయ్యుంటుంది!'' అంటూ మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. కొన్ని వందల కామెంట్లు ఆలియా మారిన గెట‌ప్ పై దూసుకొచ్చాయి. ఇంకా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇది ఫోటోషాప్ బ్లండ‌ర్. అత్యుత్సాహంతో చేసిన త‌ప్పిదం అని గ‌మ‌నించాలి. మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ల‌ను ప‌లువురు నెటిజ‌నులు తీవ్రంగా ట్రోల్ చేసారు. ఆలియాకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేశారా? అంటూ ప‌లువ‌రు క‌వ‌ర్ ఫోటోల‌పై పంచ్‌లు విసిరారు!