Begin typing your search above and press return to search.

స‌లహా కోసం ఇంటికెళ్తే కుమార్తెని అంట‌గ‌ట్టాడు!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Aug 2023 12:30 AM GMT
స‌లహా కోసం ఇంటికెళ్తే కుమార్తెని అంట‌గ‌ట్టాడు!
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' ..'గంగూబాయి క‌తియావాడి'.. 'డార్లిగ్స్' లాంటి చిత్రాల‌తో విజ‌య ఢంకా మోగించింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'రాకీ ఔర్ రానీ కీప్రేమ్ క‌హానీ' తోనూ మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. అలియా అందం..అభిన‌యంతో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఓ పాపాయికి త‌ల్లైనా అలియా ఇంకా స్వీట్ 16 అనిపిస్తుంది.

తాజాగా ఈ సినిమా అనుభ‌వాల్ని ఓ వేదిక సంద‌ర్భంగా పంచుకుంది. 'ఈ సినిమా కోసం చాలా కాలం త‌ర్వాత ఓ పాట‌కి లిప్ సింక్ ఇవ్వ‌డం కోసం షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లాను. కొన్ని స‌ల‌హాలు తీసుకున్నాను. కొన్ని నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ మొద‌టిసారి ఓ పాట‌కి లిప్ సింక్ చేయ‌డానికి చాలా భ‌య‌ప‌డ్డాను. అందులోనూ చాలా కాలం క్రితం వ‌చ్చిన 'ఇష్క్ వాలా' ల‌వ్ పాట త‌ర్వాత ఇప్పుడు బాగా చేస్తానో? లేదో? భ‌యం ఉండేది. షారుక్ ఖాన్ కి ఫోన్ చేయ్ ఏమైనా స‌ల‌హాలు ఇవ్వొచ్చ‌ని క‌ర‌ణ్ అన్నారు.

ఆయ‌న ఇంటికి ర‌మ్మ‌న‌గానే వెళ్లాను. ఆ స‌మ‌యంలో ఆయ‌న కుమార్తె సుహానే కూడా ఆ పాట లిప్ సింక్ నేర్చుకోవాల‌నుకుంటుందిట‌. దీంతో షారుక్ కుమార్తెని తీసుకొచ్చి నా ప‌క్క‌న కూర్చోబెట్టారు. ఇద్ద‌రం క‌లిసి దాదాపు మూడు గంట‌ల‌కు పైగా ఆ పాట‌కి లిప్ సింక్ చేయ‌డం ప్రారంభించాం. ఎలాగో లా ఆ పాట లిప్ సింక్ కానిచ్చేసాం. ఆ ఫాట‌ని శ్రేయోఘోష‌ల్ ఆల‌పించారు. ఆమె పాడితే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ స్వ‌రంలో ఏదో మాధుర్యం ఉంది. పాట వింటున్న‌త సేపు అలా ఉండిపోవాలనిపిస్తుంది' అని అన్నారు.

త్వ‌ర‌లో అలియాభ‌ట్ హాలీవుడ్ సినిమా 'హార్ట్ ఆప్ స్టోన్' తో ప్రేక్ష‌కుల మందుకు రానుంది. ఇందులో సాహ‌సోపేత‌మైన యాక్ష‌న్ తో మెప్పించ‌నుంది. ఈ సినిమా షూటింగ్ కోసం గ‌ర్బాన్ని సైతం లెక్క చేయ‌లేదు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అలాగే పాల్గొంది. ఇప్ప‌టికే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.