Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బికినీలో మన్మధుడి ముద్దుగుమ్మ

కన్నడ ముద్దుగుమ్మ అక్షర గౌడ 2011 లో ఉయార్తిరు 420 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది

By:  Tupaki Desk   |   21 March 2024 9:31 AM GMT
పిక్ టాక్ : బికినీలో మన్మధుడి ముద్దుగుమ్మ
X

కన్నడ ముద్దుగుమ్మ అక్షర గౌడ 2011 లో ఉయార్తిరు 420 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తన అందంతో పాటు అభినయంతో మెప్పిస్తూ వచ్చిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మన్మథుడు 2 సినిమాలో ఈ అమ్మడు నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. టాలీవుడ్ లో మొదటి సినిమా నిరాశపరచడంతో ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోలేక పోయింది. అయితే కాస్త గ్యాప్ తర్వాత ది వారియర్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. గత ఏడాది దాస్ కా దమ్కీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాలతో ఈ అమ్మడు స్టార్‌ స్టేటస్ ను దక్కించుకోలేక పోయినా కూడా సోషల్‌ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట రెగ్యులర్ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా బికినీ ఫోటోలతో అక్షర గౌడ హీట్‌ పెంచే విధంగా ఫోటోలు షేర్ చేసింది.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఈ అమ్మడు బికినీ లో భలే అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ముద్దుగుమ్మలకు బికినీ షూట్‌ సెట్‌ అవ్వదు. కానీ ఈ అమ్మడికి మాత్రం భలే అందంగా ఉంది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఇలాంటి పిక్స్ తో ఈ అమ్మడు మంచి ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.