Begin typing your search above and press return to search.

స‌డెన్ షాకిచ్చిన RGV డిస్క‌వ‌రీ

త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీక్షించిన రామ్ గోపాల్ వర్మ వాటిని తన ట్విట్టర్‌లోను ప‌లుమార్లు షేర్ చేసి ప్ర‌చారం క‌ల్పించారు

By:  Tupaki Desk   |   14 March 2024 6:30 PM GMT
స‌డెన్ షాకిచ్చిన RGV డిస్క‌వ‌రీ
X

న‌టి.. మోడ‌ల్ కం ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఆరాధ్య దేవి సుప‌రిచితురాలు. మోడ‌లింగ్ నుంచి ల‌ఘు చిత్రాల్లోకి, అటుపై పెద్ద తెర‌పై స‌హాయ‌క పాత్ర‌ల్లోకి వ‌చ్చి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆర్జీవీ డిస్క‌వ‌రీగా పాపుల‌రైపోతోంది. ఆరాధ్యా దేవిని గతంలో శ్రీలక్ష్మి సతీష్ అని పిలిచేవారు. ఆరాధ్య సౌత్ పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ సైకలాజికల్ థ్రిల్లర్ 'సారీ'తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఆరాధ్య.

త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీక్షించిన రామ్ గోపాల్ వర్మ వాటిని తన ట్విట్టర్‌లోను ప‌లుమార్లు షేర్ చేసి ప్ర‌చారం క‌ల్పించారు. దీంతో ఆరాధ్య ఆర్జీవీ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో మొదటి సినిమా అవకాశాన్ని అందుకుంది. సినీరంగంలో ప్ర‌వేశించ‌గానే ఆరాధ్య తల్లి గారు కుమార్తె స్క్రీన్ పేరుని శ్రీలక్ష్మి సతీష్ నుండి ఆరాధ్య దేవిగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

ఆరాధ్య‌ అనేక మలయాళ షార్ట్ ఫిల్మ్‌లలో సహాయ పాత్రలు కూడా పోషించింది. ఆసక్తికరంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరాధ్య ఫోటోలు, వీడియోలు యువ‌త‌రం కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ గా మారాయి. ఆర్జీవీ నిరంత‌రం వీటిని త‌న సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ జూమ్ చేస్తుండ‌డంతో ఆరాధ్య‌కు మ‌రింత‌గా ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇప్పుడు ఆరాధ్య దేవి లేటెస్ట్ ఫోటోషూట్ గ్లింప్స్ ని ఆర్జీవీ త‌న ఆర్జీవీ జూమిన్ ఇన్ స్టా పేజీలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఆరాధ్య రొటీన్ శారీ లుక్ కి భిన్నంగా టూ హాట్ గా ఫోజులిచ్చింది. ఈ కొత్త లుక్ కి యూత్ స్ట‌న్ అయిపోతున్నారు.

ఆరాధ్య ష‌ర్ట్ బ‌ట‌న్ ఓపెన్ చేసి, వెట్ లుక్ లో రెబ‌ల్ లా ఫోజులిచ్చింది. దీనిపై ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్పందించారు. హే @yesh_clickss మీ ఫోటోగ్రఫీ ద్వారా SAAREE అమ్మాయి ఆరాధ్యాదేవిని మార్చినందుకు నేను షాక్ అయ్యాను .. ఈ లింక్‌ని నమ్మడానికి ఆరాధ్య ఫోటోల‌ను చూడండి అని రాసాడు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఆరాధ్య‌లో చాలా మంది మ‌ల‌యాళ భామ‌ల‌ను పోలి ఉంది. నిత్యా మీన‌న్, నివేద థామ‌స్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌ర‌హాలో ఈ భామ కూడా దూసుకుపోతుందేమో చూడాలి.