Begin typing your search above and press return to search.

ఆ టైమ్ లో బాలీవుడ్ ను వ‌దిలేద్దామ‌నుకున్నా

రీసెంట్ గా కీర్తి సురేష్ న‌టించిన బేబీ జాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన వామికా గ‌బ్బి ఆ సినిమాతో మంచి గుర్తింపే ద‌క్కించుకుంది.

By:  Tupaki Desk   |   31 May 2025 2:00 AM IST
ఆ టైమ్ లో బాలీవుడ్ ను వ‌దిలేద్దామ‌నుకున్నా
X

సుధీర్ బాబు హీరోగా ప‌దేళ్ల కింద‌ట వ‌చ్చిన భ‌లే మంచి రోజు సినిమాలో హీరోయిన్ గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచయ‌మైన వామికా గ‌బ్బి ఆ త‌ర్వాత ఇక్కడ క‌నిపించ‌లేదు. వామికా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపు 20 ఏళ్ల‌వుతుంది. కెరీర్ స్టార్టింగ్ లో జూనియ‌ర్ ఆర్టిస్టుగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన వామికా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వ‌రుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తుంది.

రీసెంట్ గా కీర్తి సురేష్ న‌టించిన బేబీ జాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన వామికా గ‌బ్బి ఆ సినిమాతో మంచి గుర్తింపే ద‌క్కించుకుంది. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నే వామికాకు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే వామికా నుంచి వ‌రుస సినిమాలు రానున్నాయి. భ‌లే మంచి రోజు త‌ర్వాత ప్ర‌స్తుతం తెలుగులో అడివి శేష్ తో క‌లిసి జీ2 సినిమాలో న‌టిస్తోంది వామికా.

తెలుగు, త‌మిళ‌, పంజాబీ, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తున్న వామికా సినిమాల‌తో పాటూ వెబ్ సిరీస్‌ల్లో కూడా న‌టిస్తోంది. రీసెంట్ గా వామికా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకెక్కింది. ప్ర‌స్తుతం ప‌లు భాష‌ల్లో బిజీగా ఉన్న వామికా 2019లో బాలీవుడ్ ను వదిలి వెళ్లిపోవాల‌ని అనుకున్న‌ట్టు కామెంట్ చేసి అంద‌రినీ ఆశ‌ర్చ‌ప‌రిచింది.

అయితే బాలీవుడ్ ను విడిచి వెళ్లాల‌నుకోవ‌డానికి రీజ‌న్ ను మాత్రం వామికా బ‌య‌ట‌పెట్ట‌లేదు. దాంతో పాటూ తాను కేవ‌లం లండ‌న్ వెళ్లేందుకు మాత్ర‌మే 83 అనే సినిమాలో చిన్న క్యారెక్ట‌ర్ లో న‌టించాన‌ని, ఆ ఎక్స్‌పీరియెన్స్ త‌న‌లో యాక్టింగ్ ప‌ట్ల ఇష్టాన్ని పెంచిందని వామికా వెల్ల‌డించింది. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 83 సినిమాలో వామికా అన్ను లాల్ పాత్ర‌లో క‌నిపించింది.