ప్రాణ ముప్పు ఉందంటున్న అలనాటి స్టార్ హీరోయిన్
బాలీవుడ్ తో పాటూ తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా నిలిచిన తను శ్రీ దత్తా 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ గా గెలిచారు.
By: Tupaki Desk | 26 July 2025 1:43 PM ISTబాలీవుడ్ తో పాటూ తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా నిలిచిన తను శ్రీ దత్తా 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ గా గెలిచారు. ఆ తర్వాత కొన్ని సాంగ్స్ తో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఆమె, 2005లో వీరభద్ర అనే సినిమాలో నటించారు. 2013 తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమైన తను శ్రీ దత్తా రీసెంట్ గా తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లోకెక్కారు.
బాలీవుడ్ లో మీటూ ఉద్యమానికి బాటలు వేసిన తనుశ్రీ గత ఆరేళ్లుగా తన సొంతింట్లోనే వేధింపులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ దత్త చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
వేధింపులపై తాను చేసిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి తనకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారని చెప్పిన ఆమె, గత కొన్నేళ్లుగా తాను స్పిరిట్యువల్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడ్డానని అందుకే ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదని తెలిపారు. ఆరోగ్యం బాలేకపోయినా కొన్ని రోజుల నుంచి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నానని, అందరితో మాట్లాడటానికి తనకు కాస్త టైమ్ పడుతుందని, తనను ప్రశాంతంగా ఉండనీమయని కోరారు.
మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్ లో మాఫియా చాలా పెద్దదని, తన ప్రాణానికి ప్రమాదముందని, హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లానే తన ప్రాణం కూడా ప్రమాదంలో ఉందని, అతనిలాగే తనను కూడా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తనుశ్రీ దత్తా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఇవన్నీ విన్న నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, ఇదంతా బాధాకరమని, ఆమెకు తక్షణ సహాయం అందించాలని, ఒక నటికి కూడా సేఫ్టీ లేకపోవడం చాలా దురదృష్టకరమంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనకు ఎవరి వల్ల ప్రమాదముందనే విషయాన్ని మాత్రం తనుశ్రీ దత్తా ఎక్కడా ప్రస్తావించింది లేదు.
