సూదికి దారి ఇవ్వకుండా దారం ఎలా దూరుతుంది!
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశం ఎప్పటికప్పుడు చర్చకొస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది నటీమణులు ఈ అంశంపై బహిరంగంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.
By: Tupaki Desk | 4 July 2025 10:30 PMసినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశం ఎప్పటికప్పుడు చర్చకొస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది నటీమణులు ఈ అంశంపై బహిరంగంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇండస్ట్రీలో వేధిం పులు ఎలా ఉంటాయి? కాస్టింగ్ కౌచ్ పేరుతో వ్యవహరించే తీరును చాలా మంది నటీమణులు వెల్ల డించారు. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ సీనియర్ నటి సుధ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
`గోడకు బంతి ఎంత బలంగా తాకితే అంతే వేగంతో తిరిగి వస్తుంది. అలాగే మన ప్రవర్తనను బట్టే ఎదుట వారి స్పందనా ఉంటుంది. అవకాశం ఇస్తేనే వాళ్లు కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారన్నారు. సూదికి దారి ఇవ్వకుండా దారం ఎలా దూరుతుంది. ఇలాంటి విషయాల్లో ఇరువైపుల నుంచి విన్న తర్వాతే ఒక నిర్దారణకు రావాలి. ఒకరి మాటనే నమ్మి అదే నిజం అంటే ఎలా? ఒకరి మాటతోనే దోషీగా నిర్దారించడం భావ్యం కాదు. రెండు వైపులా పిలిచి మాట్లాడితే నిజానిజాలు తేలిపోతాయి కదా.
నా అభిప్రాయం అన్నది ఓల్డ్ స్కూల్ లా అనిపించినా? దీనిపై విమర్శలొచ్చినా నేను వాటిని పట్టించు కోనన్నారు. ఇలా ఉండటమే తనకు ఇష్టమన్నారు.కొన్ని సంఘటనలు జరిగిన వెంటనే స్పందించకుండా, ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అప్పటి పరిస్థితుల కారణంగా చెప్పలేకపోయినా? ఘటన జరిగిన కొన్ని నెలలకైనా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా సంవత్సరాలు గడిచిన తర్వాత ఓపెన్ అయితే న్యాయం ఎలా జరుగుతందన్నారు.
అలాగే మోబైల్ వాడకం పెరిగిన తర్వాత మంచి కంటే చెడే ఎక్కువగా కనిపిస్తుందన్నారు. పిల్లలో ఫోన్ విషయంలో అవగాహన చాలా అవసరం. లేకపోతే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇందులో మార్పులు తీసుకురావాలి. దేశంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎలా స్పందించాలో కూడా అర్దం కాలేదన్నారు.