అందాల భామ చేతికి ఇంటర్నేషనల్ బ్రాండ్..!
లండన్ కి చెందిన ఇంటర్నేషనల్ ఫ్రాంగ్రన్స్ యార్డ్ లీ కి అమ్మడి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది.
By: Tupaki Desk | 27 May 2025 8:15 AM ISTటాలీవుడ్ అందాల భామ శ్రీ లీల ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాల పరంగా ఈమధ్య కాస్త జోరు తగ్గించిందని అనిపించినా మళ్లీ ఊపందుకునేలా వరుస క్రేజీ సినిమాలు చేస్తుంది శ్రీలీల. అందంతోనే కాదు అభినయంతో కూడా అదరగొట్టేస్తుందని భగవంత్ కేసరి లాంటి సినిమా చూస్తే అర్ధమయ్యింది.
ప్రస్తుతం అమ్మడు మాస్ మహరాజ్ రవితేజతో మరోసారి మాస్ జాతర సినిమాలో నటిస్తుంది. ఈ ఇద్దరు కలిసి చేసిన ధమాకా సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈమధ్య యాడ్స్ లో బాగా కనిపిస్తున్న శ్రీలీల చేతికి మరో క్రేజీ బ్రాండ్ వచ్చి చేరిందని తెలుస్తుంది. ఈసారి అమ్మడు ఇంటర్నేషనల్ బ్రాండ్ ని సొంతం చేసుకుంది.
లండన్ కి చెందిన ఇంటర్నేషనల్ ఫ్రాంగ్రన్స్ యార్డ్ లీ కి అమ్మడి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఇందుకు శ్రీలీల భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. యార్డ్ లీ కి ఇదివరకు బాలీవుడ్ తారలు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం శ్రీలీల వారందరినీ కాదని ఆ బ్రాండ్ కి ఇండియాలో బ్రాండింగ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్రాగ్రన్స్ మొదటి ఛాయిస్ శ్రీలీల అవ్వడం క్రేజీ విషయమని చెప్పొచ్చు.
ఈమధ్య సౌత్ హీరోయిన్స్ కూడా అన్నిట్లో బాలీవుడ్ భామలకు పోటీ ఇస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలతో వారికి ఈక్వెల్ క్రేజ్ ని అందుకోవడమే కాదు వారికి ఈక్వల్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో కూడా సౌత్ భామల సందడి మొదలైంది. రష్మిక లాంటి హీరోయిన్స్ అక్కడ టాప్ స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తున్నారు.
సో మారిన ఈ మొమెంటం ని మన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. యువ హీరోయిన్స్ లో శ్రీలీల సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలను కూడా చేస్తుంది అమ్మడు. ప్రస్తుతం అక్కడ కార్తీక్ ఆర్యన్ తో ఒక లవ్ స్టోరీ చేస్తుంది శ్రీలీల. ఆ సినిమా ఆషికి 3 అంటూ కొందరు చెబుతున్నారు. మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఐతే రిలీజైన టీజర్ చూస్తే మాత్రం అది కచ్చితంగా ఆషికి 3 అనే ఫీల్ కలిగిస్తుంది.
