శ్రీలీల రికార్డ్.. ఒకేసారి నాలుగు భాషల్లో..!
కన్నడ మూవీ 'కిస్'తో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీలీల తెలుగులో 2021లో 'పెళ్లి సందడి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 20 July 2025 4:00 AM ISTకన్నడ మూవీ 'కిస్'తో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీలీల తెలుగులో 2021లో 'పెళ్లి సందడి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తెలుగులో మొదటి సినిమానే ఫ్లాప్ కావడంతో శ్రీలీలను ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు పెద్దగా పట్టించుకోరని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ లక్కీగా శ్రీలీలకు ధమాకా సినిమాలో నటించే అవకాశం దక్కింది. వరుస ఫ్లాప్స్‌లో ఉన్న రవితేజతో శ్రీలీల నటించడంతో చాలా మంది పట్టించుకోలేదు. కానీ ధమాకా సినిమా హిట్ కావడంతో పాటు, ఆ సినిమాలో శ్రీలీల అందంతో పాటు డాన్స్‌తో మెప్పించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ధమాకాతో శ్రీలీల చేతికి ఏకంగా అర డజను సినిమాలు వచ్చి పడ్డాయి.
హీరోయిన్‌గా ఒకే ఏడాదిలో డజనుకు పైగా సినిమాలతో వచ్చి అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఏడాది గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయడం మాత్రమే కాకుండా పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, కొన్ని సినిమాలు ఆమెకు నటిగా, డాన్సర్‌గా గుర్తింపును తెచ్చి పెట్టాయి. 2024 చివర్లో వచ్చిన పుష్ప 2 సినిమా శ్రీలీలను పాన్ ఇండియా రేంజ్‌కి చేర్చింది. పుష్ప 2 లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌తో ఒక్కసారిగా బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ ఐటెం సాంగ్ హిందీలో సూపర్ హిట్ కావడంతో శ్రీలీలకు హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా తమిళ్‌లోనూ మొదటి ఆఫర్‌ను తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.
శ్రీలీల మొదటి సినిమా 2019లో చేయగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, కన్నడ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఇప్పుడు తమిళ్, హిందీ సినిమాలను సైతం చేస్తుంది. ఒకేసారి నాలుగు భాషల సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకవైపు కన్నడంలో జూనియర్, తెలుగులో మాస్ జాతర, తమిళ్‌లో పరాశక్తి, హిందీలో ఆషికి 3 సినిమాలు చేసి ఒకే సారి నాలుగు భాషల్లో నటించి రికార్డ్‌ను సృష్టించింది. శ్రీలీల హిందీలో నటిస్తున్న ఆషికి 3 ఇంకా విడుదల కాలేదు. అప్పుడే హిందీలో మరో సినిమాకు ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా చిన్నా చితకా హీరో కాకుండా ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో శ్రీలీలకు ఛాన్స్ దక్కింది.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ యంగ్ హీరోలు సౌత్ దర్శకులు, హీరోయిన్స్ వెంట పడుతున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తెలుగు దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే హిందీ సినిమా నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడి కానున్నాయి. మరో వైపు తమిళ్‌లో పరాశక్తి విడుదల కాకుండానే మరో సినిమాను కూడా ఓకే చేసింది. ఆ సినిమా ప్రకటన త్వరలో రానుంది. మొత్తానికి శ్రీలీల మోస్ట్ బిజీ హీరోయిన్‌గా ఉంది.
