Begin typing your search above and press return to search.

సన్‌సెట్‌లో శ్రీలీల వయ్యారాలు.. బీచ్‌లో ఇలా..

టాలీవుడ్‌ యూత్ ఫేవరెట్ శ్రీలీల మరోసారి తన అందంతో సోషల్ మీడియాలో హీట్ పెంచింది.

By:  Tupaki Desk   |   10 July 2025 11:43 AM IST
సన్‌సెట్‌లో శ్రీలీల వయ్యారాలు.. బీచ్‌లో ఇలా..
X

టాలీవుడ్‌ యూత్ ఫేవరెట్ శ్రీలీల మరోసారి తన అందంతో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. ఈసారి బీచ్ వేదికగా మెరుపులాంటి మూమెంట్ అందించి, ఫ్యాన్స్‌కి మంచి ఫీల్ ఇచ్చింది. సన్‌సెట్ వైపు నడుస్తూ కనిపించిన ఆమె లుక్.. తాను వేసుకున్న పింక్ షార్ట్‌సూట్, అలజడి కలిగించే హెయిర్‌స్టైల్‌తో కలిపి ఫుల్ వైరల్ అవుతోంది.

బ్యాక్ వ్యూలో ఆమె అడుగులు వెలుతురు వైపు నడుస్తుండటంతో, "వాకిన్ టువార్డ్స్ మై లైట్" అన్న క్యాప్షన్ కి టోటల్ ఫీల్ తో వచ్చింది. ఈ రీల్‌లో శ్రీలీల నడక, బాడీ లాంగ్వేజ్, ఆ కెమెరా యాంగిల్ అన్నీ కలిపి ఓ సినిమాటిక్ సీన్‌లా మారాయి. సూర్యాస్తమయం, సముద్రపు శబ్దం, రెలాక్సింగ్ వాతావరణం అన్నీ కలిసి ఆమె స్టన్నింగ్ లుక్‌కి ఎక్స్‌ట్రా మ్యాజిక్‌ ఇచ్చాయి.

ఇప్పటివరకు శ్రీలీల పెట్టిన బీచ్ ఫోటోస్ లో ఇది టాప్ వన్ అనేలా నెటిజన్ల కామెంట్లు రావడమే కాదు, ఒక్క రోజు లోనే లక్షల్లో లైక్స్ కూడా వచ్చాయి. శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే, ఆమె 'పెళ్లిసందడి' చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చినా.. అసలు మ్యాజిక్ ‘ధమాకా’, ‘గుంటూరు కారం’ వంటి సినిమాలతో చూపించింది. పవన్ కల్యాణ్‌తో నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" ఆమె కెరీర్‌లో ఓ బిగ్ హిట్ గా మారబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఒకవైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు గ్లామర్ ప్రెజెన్స్‌తో సోషల్ మీడియాలో క్రేజ్ మెరుగుపరుచుకుంటోంది. ఇన్‌స్టాలో ఆమె పోస్టులు చూస్తే, స్టయిలిష్ డ్రెస్‌తో పాటు ఆ మూడ్‌కి తగ్గ బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ మిక్స్ చేస్తూ, నెక్స్ట్ లెవెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బీచ్ లుక్‌తోనైతే యూత్ కి సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది.