Begin typing your search above and press return to search.

షాలిని సరికొత్త 'అందాలు' చూడతరమా?

ఈ క్రమంలోనే తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న షాలిని పాండే షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పవచ్చు.

By:  Madhu Reddy   |   19 Oct 2025 12:23 PM IST
షాలిని సరికొత్త అందాలు చూడతరమా?
X

హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషా సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఇటు ఫాలోవర్స్ ని కూడా పెంచుకునే పనిలో పడ్డారు..గ్లామర్ ఫోటోలతో పాటు బికినీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తున్న వీరు.. ఈ మధ్యకాలంలో షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. అందాలను చూపిస్తూ షేర్ చేస్తున్న ఫోటోలు అటు కుర్ర కారులో కూడా హీట్ పుట్టిస్తున్నాయి.


ఈ క్రమంలోనే తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న షాలిని పాండే షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పవచ్చు. మధ్యాహ్నం సమయంలో సూర్యుడి కిరణాలు పడుతున్న వేళ.. అప్పుడే నిద్రలేచినట్టుగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఈమె బోల్డ్ నెస్ చూసి కుర్రకారు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా షాలిని పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.


షాలిని పాండే విషయానికి వస్తే తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాల ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తమిళ చిత్రం 100% కాదల్ సినిమాలో కూడా నటించింది..అలాగే మహానటి , 118 చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన షాలిని పాండే హిందీలో 2022లో జయేష్ భాయ్ జోర్దార్ తోపాటు 2024లో మహారాజు అనే చిత్రంలో కూడా నటించింది.


1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించిన షాలిని పాండే నటన రంగ ప్రవేశం చేయడానికి ముందు జబల్పూర్ లోనే థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమె తెలుగులో ఇద్దరి లోకం ఒకటే.. నిశ్శబ్దం వంటి చిత్రాలు చేసింది. ఇటీవల ఇడ్లీ కడై చిత్రంలో కూడా నటించిన ఈమె.. హిందీలో రాహు కేతువు అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

ఇకపోతే సినిమాలలోనే కాదు టెలివిజన్ సిరీస్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. 2016లో మన్ మే హై విశ్వాస్ అనే సిరీస్ లో నటించిన ఈమె.. ఆ తర్వాత క్రైమ్ పెట్రోల్, డబ్బా కార్టెల్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అంతేకాదు 2022లో అర్మాన్ మాలిక్ పాడిన మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది షాలినీ పాండే. ఏదేమైనా ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారిన షాలిని పాండే ఇప్పుడు ఇలా గ్లామర్ అందాలతో కూడా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు.