Begin typing your search above and press return to search.

వాళ్లు పోయారు.. వీళ్లు వచ్చారు- టాలీవుడ్ లో హీరోయిన్ల రిప్లేస్ మెంట్

ఒక సినిమా ప్రారంభమైనప్పుడు ఎంపికైన నటీనటులు చివరిదాకా అదే ప్రాజెక్ట్ తో ట్రావెల్ చేస్తారని కచ్చితంగా చెప్పలేం.

By:  Tupaki Desk   |   13 July 2025 1:00 PM IST
వాళ్లు పోయారు.. వీళ్లు వచ్చారు- టాలీవుడ్ లో హీరోయిన్ల రిప్లేస్ మెంట్
X

ఒక సినిమా ప్రారంభమైనప్పుడు ఎంపికైన నటీనటులు చివరిదాకా అదే ప్రాజెక్ట్ తో ట్రావెల్ చేస్తారని కచ్చితంగా చెప్పలేం. సినిమా అనుకున్నప్పుడు అవకాశం దక్కినా, తర్వాత ఆ ఛాన్స్ మిస్ అవ్వడం ఈ రోజుల్లో మామూలు అయిపోయింది. ప్రాజెక్ట్ కాస్ట్, నటీనటుల డేట్స్ కుదరకపోవడం, ఇతర కారణాల వల్ల సినిమా మధ్యలోనే తప్పుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ఎక్కువగా హీరోయిన్లు ఉంటున్నారు. మరి ఇటీవల కాలంలో పలు కారణాల వల్ల సినిమా ఒప్పుకున్న తర్వాత తప్పుకున్న వాళ్లెవరో చూద్దాం!

టాలెండెట్ నటుడు అడివి శేష్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా డకాయిట్. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో తొలుత శ్రుతి హాసన్ ను ఎంపిక చేశారు. ఆమె షూటింగ్ లో పాల్గొంది. శ్రుతి పోస్టర్లు సైతం మేకర్స్ విడుదల చేశారు. అయితే కొద్ది రోజులకు పలు కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. శ్రుతి స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబర్ 25న విడుదల కానుంది.

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందింది నటి శ్రీలీల. ఆమెకు కెరీర్ ప్రారంభంలో ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. దీంతో ఆమె డేట్స్ అడ్జస్వ్ అవ్వలేక ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుంది. ఇందులో నవీన్ పోలిశెట్టి 'అనగనగ ఒక రాజు' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరి ఆ స్థానాన్ని రిప్లేస్ చేస్తుంది.

ఇక అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమాలో హీరోయిన్ శ్రీలీలనే. కొన్ని రోజులు షూటింగ్ లో సైతం పాల్గొంది. ఏప్రిల్ లో విడుదల చేసిన టీజర్ లోనూ శ్రీలీలను చూపించారు. కానీ ఏమైందో తెలీదు, ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందని తెలుస్తోంది. ఆమె స్థానంలో భాగ్య శ్రీ భోర్సే ని తీసుకున్నట్లు సమాచారం.

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే కూడా ఈ లిస్ట్ లో ఉంది. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో హీరోయిన్ పాత్రకు ముందుగా ఆమె పేరును పరిశీలించారు. కానీ కొన్ని కారణాల వల్ల, మేకర్స్ చివరి నిమిషంలో శ్రీలీలనే ఎంచుకున్నారు. అటు కోలీవుడ్ లో ధనుష్ హీరోగా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పూజా హెగ్డే స్థానంలో మలయాళ నటి మమిత బైజును తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ లీడ్ రోల్ లో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా స్పిరిట్. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పజుకొణెను తీసుకోవాలని సందీప్ భావించారు. కానీ దీపిక డిమాండ్ల కారణంగా సందీప్ తన నిర్ణయం మార్చుకున్నారు. ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రీని ఎంపిక చేసుకున్నారు.