రంభ రీ ఎంట్రీ ఇస్తుందా? నిర్మాత గానా? నటి గానా?
టాలీవుడ్ నటి రంభ గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని హీరోయిన్స్ లిస్ట్ లో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది
By: Tupaki Desk | 8 Jun 2025 8:45 AM ISTటాలీవుడ్ నటి రంభ గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని హీరోయిన్స్ లిస్ట్ లో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. 32 ఏళ్ల క్రితం మలయాళ చిత్రం సర్గం ద్వారా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రంభ.. అదే ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చేసింది.
ఆ ఒకటి అడక్కు అంటూ డెబ్యూ మూవీతో మంచి హిట్ అందుకున్న బ్యూటీ.. అందులో ఆమె పేరు రంభ కావడంతో అదే స్థిరపడిపోయింది. ఒరిజినల్ పేరు మాత్రం విజయలక్ష్మి. అప్పట్లో దాదాపు అందరు టాప్ హీరోలతో ఆడిపాడింది. బాలీవుడ్ లో కూడా సందడి చేసింది. కోలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఆమె సొంతం.
కన్నడం, మలయాళం, బెంగాలీ, బోజ్‌పురి భాషల్లో కూడా సినిమాలు చేసిన రంభ.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఏలింది. రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించింది. 100కు పైగా చిత్రాల్లో నటించిన రంభ.. 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే పారిశ్రామిక వేత్తను వివాహం చేసుకుంది.
ప్రస్తుతం వారిద్దరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెళ్లి తర్వాత పలు సినిమాల్లో కనిపించిన అమ్మడు.. మెల్లగా యాక్టింగ్ కు దూరమైంది. రీసెంట్ గా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె.. ఓ టీవీ షోలో జడ్జ్ గా కనిపించి సందడి చేసింది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే నటి గానా లేక నిర్మాతగా అనేది ఆమె ఇంకా ఫిక్స్ అవ్వలేదని సమాచారం. నిజానికి.. త్రీ రోజెస్ అనే సినిమాను ఇప్పటికే నిర్మించింది రంభ. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. అదే సమయంలో ఆమె నిర్మాతగా వ్యవహరిస్తే.. కొందరు దర్శకులు సినిమాలు తెరకెక్కించాలని ఎదురుచూస్తున్నారట.
కానీ ఆమె ఇంకా సందిగ్ధంలో ఉన్నారని టాక్. అదే సమయంలో రంభ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయండి మేడమ్ అంటూ అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ అప్డేట్స్ అంటూ సందడి చేస్తున్నారు. మరి రంభ ఏం చేస్తారో వేచి చూడాలి.
