Begin typing your search above and press return to search.

నందిత శ్వేత లిప్ లాక్ లు ధారాళంగా!

`ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ` సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ బ్యూటీ నందిత శ్వేత సుప‌రిచిత‌మే.

By:  Tupaki Desk   |   16 July 2023 7:50 AM GMT
నందిత శ్వేత లిప్ లాక్ లు ధారాళంగా!
X

`ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ` సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ బ్యూటీ నందిత శ్వేత సుప‌రిచిత‌మే. ఆ త‌ర్వాత `శ్రీనివాస‌క‌ళ్యాణం`..`బ్ల‌ప్ మాస్ట‌ర్ `లాంటి చాలా చిత్రాలు చేసింది. కానీ ఏవి అమ్మ‌డిని విజ‌య మార్గంలో న‌డించ‌లేదు. అయినా అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తూ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రోవైపు టీవీ ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గానూ ప‌నిచేస్తూ టాలీవుడ్ కి రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటుంది.

అయితే క‌న్న‌డ బ్యూటీలు అంద‌రి త‌ర‌హాలోనే అమ్మ‌డు తొలి నుంచి మ‌డిక‌ట్టుకునే ఉంది. డీసెంట్ పాత్ర‌లు త‌ప్ప బోల్డ్ అటెంప్ట్ చేసింది లేదు. ఆ ర‌కంగా కాస్త వెనుకబ‌డి ఉంది ఇంత‌కాలం. అయితే ఇప్పుడా ఆలోచ‌న మానుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా న‌టిస్తోన్న `హిడింబ‌` సినిమాలో హ‌ద్దులు చెరిపేసిన న‌టించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో అశ్విన్ బాబు హీరోగా న‌టిస్తున్నాడు.

త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న నేప‌థ్యంలో నందిత సినిమా విశేషాలు పంచుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న పాత్ర ఎలా ఉంటుంద‌న్న‌ది రివీల్ చేసింది. ఈ సినిమాలో రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించాను. ఇంత‌కాలం ఆ త‌ర‌హా స‌న్నివేశాల‌కు దూరంగా ఉన్నాను. కానీ ఈ సినిమాలో స్టోరీ డిమాండ్ చేయ‌డంతో ముద్దు స‌న్నివేశాల్లో న‌టించాను. న‌టిగా నాలో కొత్త కోణం ఈ సినిమాలో క‌నిపిస్తుంది.

ఈ సినిమా కోసం బ‌రువు కూడా బాగా త‌గ్గాల్సి వ‌చ్చింది. అందుకోసం నేను చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఎందుకంటే నాకు ఫైబ్రోమ‌యోల్జియా అనే కండ‌ర రుగ్మ‌త ఉంది. దాని వ‌ల్ల ఎక్కువ డైట్ పాటిస్తూ భారీ వ్యాయామాలు చేయ‌డం సాధ్యం కాదు. మితి మీరిన ఒత్తిడి..స‌రిగ్గా నిద్ర‌లేక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఇది తీవ్ర‌త‌రం అవుతుంది. కానీ ఈ సినిమా కోసం ఆ స‌వాళ్లు అన్నింటిని ఎదుర్కున్నాను. అనుకున్న‌ట్లు వెయిట్ త‌గ్గాను. కానీ అది అలా ఉండిపోదు. మ‌ళ్లి పెరిగిపోవ‌డానికి అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది` అని తెలిపింది.